Loading...
Cyberabad Municipal Corporation: హైదరాబాద్‌లో ట్విన్‌ టవర్స్‌ తరహాలో సీఎంసీ కార్యాలయం.. రూ.169 కోట్లతో నిర్మాణం!
హైదరాబాద్‌లో ట్విన్‌ టవర్స్‌ తరహాలో సీఎంసీ కార్యాల

Cyberabad Municipal Corporation: హైదరాబాద్‌లో ట్విన్‌ టవర్స్‌ తరహాలో సీఎంసీ కార్యాలయం.. రూ.169 కోట్లతో నిర్మాణం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 21, 2026
09:40 am

ఈ వార్తాకథనం ఏంటి

సైబరాబాద్‌ నగరపాలక సంస్థ (CMC)కు త్వరలో సొంత కార్యాలయం అందుబాటులోకి రానుంది. మాదాపూర్‌లోని హైటెక్స్‌ ప్రాంతంలో ట్విన్‌ టవర్స్‌ తరహాలో కొత్త కార్యాలయ భవనాన్ని నిర్మించనున్నారు. ఎనిమిది అంతస్తుల ఎత్తు, దాదాపు 2.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో ఈ భవనాన్ని చేపట్టనున్నారు. ఇందుకోసం సీఎంసీ ఇంజినీరింగ్‌ విభాగం టెండర్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.169 కోట్లు కాగా.. పన్నులు మినహాయించి రూ.125.79 కోట్లను కాంట్రాక్టు వ్యయంగా నిర్ణయించారు. స్పెషల్‌ క్లాస్‌ కాంట్రాక్టు సంస్థలు టెండర్లలో పాల్గొనవచ్చు. ఒప్పందం కుదిరిన 12 నెలల్లో నిర్మాణ పనులు పూర్తి చేయాలని అధికారులు స్పష్టం చేశారు. మాదాపూర్‌ హైటెక్స్‌లోని 4.1 ఎకరాల స్థలంలో ఈ కార్యాలయం నిర్మాణం జరగనుంది.

వివరాలు

ఐటీ కంపెనీని తలపించేలా డిజైన్లు

ప్రస్తుతం సైబరాబాద్‌ కార్పొరేషన్‌ కార్యాలయం హైటెక్స్‌ సమీపంలోని న్యాక్‌ భవనంలో తాత్కాలికంగా కొనసాగుతోంది.

ప్రపంచస్థాయి ఐటీ కంపెనీని తలపించేలా పూర్తిస్థాయి కార్యాలయాన్ని నిర్మించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు.

దీంతో కమిషనర్‌ జి.సృజన వివిధ నమూనాలను పరిశీలించి డిజైన్లు తయారు చేయించారు. చివరకు రెండు టవర్లు, ఎనిమిది అంతస్తులతో కూడిన భవన నమూనాకు సీఎంసీ ఆమోదం తెలిపింది.

భవనం బయటి భాగంలో ముదురు కాఫీ రంగు అద్దాలను ఏర్పాటు చేయనున్నారు. ప్రతి అంతస్తులోనూ అన్ని వైపుల నుంచి గాలి, వెలుతురు వచ్చేలా డిజైన్‌ రూపొందించారు.

ఖానామెట్‌లోని హైటెక్స్‌, నోవాటెల్‌ మధ్య ఈ కార్యాలయం నిర్మించనున్నారు. భవనం వెనుక చెరువు ఉంటుంది.

రెండు టవర్లలో ఒకటి ఆరు అంతస్తులతో, మరొకటి ఎనిమిది అంతస్తులతో రూపుదిద్దుకోనుంది.

వివరాలు

ఏ అంతస్తులో ఏ కార్యాలయం ఉంటుందంటే?

మొదటి అంతస్తు - ప్రజల అంతస్తు:

195 మంది కూర్చునేలా కౌన్సిల్‌ హాల్‌.

కార్పొరేటర్లు, మేయర్ల సమావేశాలకు ప్రత్యేక ఏర్పాట్లు.

ప్రజావాణి కేంద్రం.

వీఐపీల కోసం ప్రత్యేక గది.

డైనింగ్‌ హాల్‌. - మీడియా గది.

రెండో అంతస్తు

మేయర్‌, డిప్యూటీ మేయర్‌ కార్యాలయాలు.

కమిషనర్‌ కార్యాలయం.

స్థాయీ సంఘం సమావేశ గది.

ఫ్లోర్‌ లీడర్ల క్యాబిన్లు.

సెక్రటరీ కార్యాలయం.

మూడో అంతస్తు

బ్లాక్‌ ఏ: పరిపాలన విభాగం అదనపు కమిషనర్‌, జనరల్‌ బ్రాంచి, కార్మిక సంక్షేమ విభాగం, విజిలెన్స్‌ కార్యాలయం.

బ్లాక్‌ బీ: ఆర్థిక విభాగం అదనపు కమిషనర్‌, సంబంధిత కార్యాలయాలు.

ADVERTISEMENT

వివరాలు

నాలుగో అంతస్తు

బ్లాక్‌ ఏ: క్రీడల విభాగం అదనపు కమిషనర్‌, హైడ్రా, విద్యుత్తు, జలమండలి అధికారుల గదులు.

బ్లాక్‌ బీ: పారిశుద్ధ్య విభాగం అదనపు కమిషనర్‌, సంబంధిత కార్యాలయాలు.

ఐదో అంతస్తు

ఇంజినీరింగ్‌ విభాగం.

టౌన్‌ ప్లానింగ్‌ విభాగం.

భూసేకరణ విభాగం.

ఆరో అంతస్తు

రెవెన్యూ విభాగం.

ఎన్నికల విభాగం.

ఎస్టేట్స్‌, ఐటీ, ప్రకటనల విభాగాలు.

జీఐఎస్‌, లీగల్‌ విభాగాలు.

యూసీడీ, యూబీడీ విభాగాలు.

పలు ఇంజినీరింగ్‌ విభాగాలు.

ADVERTISEMENT

వివరాలు

ఏడో అంతస్తు

1,311 చదరపు అడుగుల విస్తీర్ణంలో కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌.

కమిషనర్‌, ఇతర అధికారులకు ప్రత్యేక గదులు.

సౌర విద్యుత్తు ఏర్పాట్లు.

ఎనిమిదో అంతస్తు

3,270 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆడిటోరియం.

400 మంది కూర్చునే సామర్థ్యం.

భవనం నిర్మాణ వివరాలు

భూ విస్తీర్ణం: 16,668 చదరపు మీటర్లు (4.11 ఎకరాలు).

భవనం ఎత్తు: స్టిల్ట్‌ + 8 అంతస్తులు.

మొత్తం నిర్మాణ విస్తీర్ణం: 2,41,540 చదరపు అడుగులు.

స్టిల్ట్‌ ప్రాంతంలో ప్రవేశ ద్వారాలు, మీసేవా, పౌరసేవా కేంద్రాలు, పార్కు, వాహనాల పార్కింగ్‌, మురుగునీటి శుద్ధి కేంద్రం, శౌచాలయాలు ఏర్పాటు చేయనున్నారు.

వివరాలు

టెండర్ల వివరాలు

ప్రాజెక్టు అంచనా వ్యయం: రూ.169 కోట్లు.

కాంట్రాక్టు వ్యయం: రూ.125.79 కోట్లు.

ప్రీ-బిడ్‌ సమావేశం: నవంబర్‌ 25, 2026.

బిడ్ల దాఖలుకు చివరి తేదీ: డిసెంబర్‌ 2, 2026.

బిడ్ల సమర్పణ గడువు: మధ్యాహ్నం 3 గంటల వరకు.

నిర్మాణ గడువు: ఒప్పందం జరిగిన 12 నెలలు.

ADVERTISEMENT