Cockroach Janata Party: కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేపై దాడి
ఈ వార్తాకథనం ఏంటి
కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. జైపూర్'లో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తుండగా కొందరు వ్యక్తులు ఒక్కసారిగా ఆయన వాహనం వద్దకు చేరుకుని దాడికి దిగారు. ఈ క్రమంలో అభిజీత్ చెంపపై కొట్టి, ఆయనపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. దీంతో అప్రమత్తమైన సీజేపీ కార్యకర్తలు వెంటనే స్పందించి, అభిజీత్‌పై దాడి చేసిన వ్యక్తులపై ఎదురుదాడికి దిగారు. ఇరు వర్గాల మధ్య తోపులాట జరగడంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి.
వివరాలు
పరారీలో నిందితులు
జైపూర్'లోని అమరవీరుల స్మారక చిహ్నం వద్ద సీజేపీ చేపట్టిన నిరసన కార్యక్రమం సందర్భంగా ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. అభిజీత్‌పై దాడికి పాల్పడిన నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారని, వారిని పట్టుకునేందుకు ప్రత్యేక గాలింపు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు. ఘటనపై స్పందించిన అభిజీత్ దీప్కే.. ఈ దాడి కారణంగా యువత ఆవేశానికి గురికావద్దని విజ్ఞప్తి చేశారు. ఎలాంటి అడ్డంకులు ఎదురైనా తమ ఉద్యమాన్ని ఆపబోమని, ప్రజల కోసం పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
జైపుర్‌లో కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేపై దాడి
Abhijeet Dipke gets Slapped.
— BIO Saga (@biosagain) June 15, 2026
In Jaipur, Rajasthan, Cockroach Janta Party founder Abhijeet Dipke was slapped and roughed up by the public.
Abhijeet Dipke had been surrounded by paid supporters and protesters for so long. Today, he finally came face to face with the real public pic.twitter.com/YBXbq8oQjk