Loading...
Telangana: తెలంగాణలో మరింత పెరగనున్న చలి.. 29 జిల్లాలకు ఎల్లో అలర్ట్
తెలంగాణలో మరింత పెరగనున్న చలి.. 29 జిల్లాలకు ఎల్లో అలర్ట్

Telangana: తెలంగాణలో మరింత పెరగనున్న చలి.. 29 జిల్లాలకు ఎల్లో అలర్ట్

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 10, 2026
08:46 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలో చలి తీవ్రత మరింత పెరగనుంది. ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాలు చలితో వణుకుతుండగా.. రానున్న మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు 29 జిల్లాలకు పసుపు రంగు హెచ్చరికలు జారీ చేసింది. జోగులాంబ గద్వాల, ఖమ్మం, సూర్యాపేట, జనగామ జిల్లాలు మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల సెల్సియస్‌లోపు నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. సంగారెడ్డి, మెదక్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, నిర్మల్, వనపర్తి జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 12 డిగ్రీల వరకు పడిపోయే ప్రమాదముందని తెలిపింది. మరోవైపు వేకువజాము నుంచి ఉదయం వరకు పలు ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు ఏర్పడే అవకాశం ఉంది.

వివరాలు 

ఆదిలాబాద్‌లో 14.7 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత

దీంతో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

దేశంలోని ఈశాన్య ప్రాంతాల నుంచి తెలంగాణ వైపు తక్కువ ఎత్తులో గాలులు వీస్తుండటమే రాష్ట్రంలో చలి తీవ్రత పెరగడానికి ప్రధాన కారణమని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

రాష్ట్రంలోనే అత్యల్పంగా ఆదిలాబాద్ జిల్లాలో 14.7 డిగ్రీల సెల్సియస్ కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.

ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు రాష్ట్రంలోని 15 జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 14.7 నుంచి 15 డిగ్రీల మధ్య నమోదయ్యాయి.

సిద్దిపేట,కామారెడ్డి,సంగారెడ్డి,జనగామ జిల్లాల్లో 14.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

మరో 18 జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 15.1 నుంచి 19.5 డిగ్రీల మధ్య నమోదయ్యాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో 16.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.

ADVERTISEMENT