ఆంధ్రప్రదేశ్‌లో చల్లచల్లగా; రాష్ట్రంలో మూడు రోజుల పాటు వర్షాలు
భారత వాతావరణ శాఖ(ఐఎండీ) ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చల్లటి వార్త చెప్పింది. రానున్న మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌లో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. పశ్చిమ విదర్భ, మరఠ్వాడా మీదుగా దక్షిణ కర్ణాటక వరకు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపోస్పియర్‌లో దక్షిణ/నైరుతి గాలులు వీస్తున్నాయి.
తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
వాతావరణ శాఖ ప్రకారం, మంగళవారం ఉత్తర కోస్తా, యానాంలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆ తర్వాత బుధవారం, గురువారం ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాయలసీమ విషయానికొస్తే, మంగళ, బుధ, గురువారాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం, ఒకటి లేదా రెండు చోట్ల బలమైన గాలులు (గంటకు 30-40 కి.మీ వేగం) వచ్చే అవకాశం ఉంది.
ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి