
Temperature Drop: తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత.. ముంచంగిపుట్టులో సింగిల్ డిజిట్ టెంపరేచర్
ఈ వార్తాకథనం ఏంటి
తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు రోజు రోజుకూ తగ్గుతున్నాయి. ఉదయాన్నే బయటకు రావాలంటే చలి తీవ్రతకు ప్రజలు వణికే పరిస్థితులు ఏర్పడ్డాయి.
ఆంధ్రప్రదేశ్‌లోని ఏజెన్సీ ప్రాంతాల్లో తీవ్రంగా చలి ప్రభావం ఎక్కువగా కన్పిస్తోంది. అల్లూరి సీతారామ రాజు జిల్లా పాడేరు ఏజెన్సీ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి చేరుకున్నాయి.
ఈ చలికాలంలో తొలిసారి ముంచంగిపుట్టులో 9°C సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పాడేరు ప్రాంతంలో ఉష్ణోగ్రత 12°C వరకు పడిపోవడం గమనార్హం.
మినుములూరు, ముంచంగిపుట్టు వంటి ప్రాంతాల్లో చలి తీవ్రత కారణంగా స్థానికులు ఉదయాన్నేచలి కాచుకుంటున్నారు.
చలి తీవ్రత విపరీతంగా ఉన్నప్పటికీ పర్యాటక ప్రాంతాల్లో సందర్శకులు పెద్ద సంఖ్యలో చేరుతున్నారు.
Details
తెలంగాణలో కూడా అధికమవుతున్న చలి
పాడేరు, వంజంగి పర్యాటక కేంద్రాల్లో మేఘాల మాటున సూర్యోదయ దృశ్యాలను తిలకించేందుకు పర్యాటకులు కొండ ప్రాంతాలకు చేరుకున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో కూడా చలి మరింత ఉధృతమవుతోంది. ముఖ్యంగా హైదరాబాద్‌లో గత కొన్ని రోజుల కంటే నేటి చలి తీవ్రత మరింత పెరిగినట్లు అధికారులు తెలిపారు.
ఆంధ్ర-ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో ఈ ఏడాది చలి తీవ్రత మరింత అధికమవుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
దీంతో అక్కడి ప్రజలు చలి ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంటున్నారు.