Ayodhya Ram Mandir: జనవరి 22న సెలవు ప్రకటించి.. మద్యం బంద్ చేసిన రాష్ట్రాలు ఇవే..
ఈ వార్తాకథనం ఏంటి
జనవరి 22న అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం వైభవంగా జరగనుంది.
చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకంగా చెప్పుకునే ఈ వేడుకను చూసి తరించేందుకు దేశంలోని ఆయా రాష్ట్రాలు రాష్ట్రాలు ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి.
ఈ సందర్భంగా పలు రాష్ట్రాల్లో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు జనవరి 22న సెలవును ప్రకటించడం జరిగింది. అయితే కొన్ని రాష్ట్రాల్లో హాఫ్ డే సెలవులను కూడా ప్రకటించారు. సెలవులు ప్రకటించిన రాష్ట్రాల జాబితాను ఓసారి పరిశీలిద్దాం.
దిల్లీ: దేశ రాజధానిలోని ప్రభుత్వ కార్యాలయాలు జనవరి 22న మధ్యాహ్నం 2:30 గంటల వరకు మూసివేయబడతాయి.
ఉత్తర్‌ప్రదేశ్: రాష్ట్రవ్యాప్తంగా సోమవారం విద్యాసంస్థలు, మద్యం దుకాణాలను మూసివేయాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు.
అయోధ్య
సోమవారం ట్రేడింగ్ కూడా బంద్
మహారాష్ట్ర: మహారాష్ట్ర ప్రభుత్వం సోమవారం పబ్లిక్ హాలిడేను ప్రకటించింది. అలాగే స్టాక్ మార్కెట్ ఎక్స్ఛేంజ్ కూడా సోమవారం ట్రేడింగ్ సెలవును ప్రకటించింది.
అసోం: ఈశాన్య రాష్ట్రమైన అసోంలో సోమవారం హాఫ్ డే సెలవును ప్రకటించారు.
హర్యానా: రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా సోమవారం హర్యానాలో అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటించారు. అలాగే మద్యం షాపులను కూడా మూసివేయాలని ఆదేశించారు.
చండీగఢ్: కేంద్రపాలిత ప్రాంతం చండీగఢ్‌లోని అన్ని కార్యాలయాలకు సోమవారం సెలవు ప్రకటించారు.
గోవా: రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా గోవా ప్రభుత్వం పాఠశాలలు, ప్రభుత్వ ఉద్యోగులకు సోమవారం సెలవు ప్రకటించింది.
అయోధ్య
మధ్యప్రదేశ్, గుజరాత్, ఛత్తీస్‌గఢ్, పుదుచ్చేరిలో..
మధ్యప్రదేశ్: మధ్యప్రదేశ్ ప్రభుత్వం సోమవారం పాఠశాలలకు సెలవు ప్రకటించింది. డ్రై డేని కూడా ప్రకటించింది. అయితే ప్రభుత్వ కార్యాలయాలు మధ్యాహ్నం 2:30 గంటల తర్వాత తెరుచుకుంటాయి.
గుజరాత్: గుజరాత్‌లోని ప్రభుత్వ కార్యాలయాలు సోమవారం మధ్యాహ్నం 2:30 గంటల వరకు మూసి ఉంటాయి.
ఛత్తీస్‌గఢ్: అన్ని ప్రభుత్వ కార్యాలయాలు సోమవారం మధ్యాహ్నం 2:30 గంటల వరకు సెలవు ప్రకటించినట్లు ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం ప్రకటించింది.
పుదుచ్చేరి: కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో సోమవారం సెలవు ప్రకటించారు.
అయోధ్య
రాజస్థాన్, ఒడిశా, ఉత్తరాఖండ్, త్రిపురలో..
రాజస్థాన్: రాజస్థాన్ ప్రభుత్వం జనవరి 22, సోమవారం రాష్ట్రంలో హాఫ్ హాలిడేను ప్రకటించింది.
ఒడిశా: రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాలు సోమవారం మధ్యాహ్నం 2:30 గంటల వరకు సెలవు ప్రకటించినట్లు సర్కార్ వెల్లడించింది.
ఉత్తరాఖండ్: ఉత్తరాఖండ్‌లోని అన్ని విద్యా సంస్థలకు సోమవారం సెలవు ప్రకటించారు. ప్రభుత్వ కార్యాలయాలకు మాత్రం హాఫ్ హాలిడేను ప్రకటించారు.
త్రిపుర: త్రిపురలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు సోమవారం మధ్యాహ్నం 2:30 గంటల వరకు మూసివేసి ఉంటాయి.