LOADING...
Self enumeration: ఇంట్లో నుంచే జనగణన పూర్తి.. స్వీయగణన ఎలా చేసుకోవాలి?
ఇంట్లో నుంచే జనగణన పూర్తి.. స్వీయగణన ఎలా చేసుకోవాలి?

Self enumeration: ఇంట్లో నుంచే జనగణన పూర్తి.. స్వీయగణన ఎలా చేసుకోవాలి?

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 27, 2026
03:39 pm

ఈ వార్తాకథనం ఏంటి

జనాభా లెక్కలు-2027 కార్యక్రమంలో భాగంగా ప్రజలు స్వయంగా తమ కుటుంబ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునే 'సెల్ఫ్ ఎన్యుమరేషన్' (Self Enumeration) సదుపాయాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లో ఈ ప్రక్రియ ఏప్రిల్ 16 నుంచి ప్రారంభమై ఏప్రిల్ 30 వరకు కొనసాగుతుండగా, తెలంగాణలో ఏప్రిల్ 26 నుంచి ప్రారంభమై మే 10 వరకు అవకాశం కల్పించారు.

వివరాలు

సెల్ఫ్ ఎన్యుమరేషన్ అంటే ఏమిటి?

ప్రభుత్వం నిర్వహించే జనాభా గణనలో భాగంగా, గణకుడు ఇంటికి రాకుండానే ప్రజలు అధికారిక పోర్టల్ ద్వారా తమ కుటుంబ వివరాలను స్వయంగా నమోదు చేయడాన్ని 'సెల్ఫ్ ఎన్యుమరేషన్' అంటారు. ఇది గోప్యతను కాపాడటంతో పాటు సమయాన్ని ఆదా చేస్తుంది. ప్రక్రియ పూర్తయ్యాక ఒక ప్రత్యేక SE ID లభిస్తుంది. గణకుడు ఇంటికి వచ్చినప్పుడు ఆ ఐడీ చూపిస్తే సరిపోతుంది.

వివరాలు

ఎలా నమోదు చేయాలి?

ప్రజలు అధికారిక వెబ్‌సైట్ 'se.census.gov.in' ద్వారా తమ వివరాలను నమోదు చేసుకోవచ్చు. ఈ సైట్ ఉదయం 6 గంటల నుంచి అర్ధరాత్రి 12 వరకు అందుబాటులో ఉంటుంది. ముందుగా రాష్ట్రాన్ని ఎంపిక చేసి క్యాప్చా నమోదు చేయాలి యజమాని పేరు, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఇవ్వాలి మొబైల్‌కు వచ్చిన OTP నమోదు చేసి లాగిన్ కావాలి చిరునామా, పిన్‌కోడ్ నమోదు చేసి గూగుల్ మ్యాప్‌లో ఇంటి లొకేషన్ గుర్తించాలి అక్షాంశ, రేఖాంశాల ఆధారంగా ఇంటి స్థానాన్ని సిస్టమ్‌లో నమోదు చేస్తారు

Advertisement

వివరాలు

మొత్తం 34 ప్రశ్నలు

ఇంటి నిర్మాణం (మట్టి/సిమెంట్), గోడల స్థితి, నివాస పరిస్థితి వంటి అంశాలపై మొత్తం 34 ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి. కుటుంబ యజమాని వివరాలు నమోదు చేసిన తర్వాత ప్రతి దశలో సేవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. చివర్లో ప్రివ్యూ చూసి సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన వెంటనే ఒక రెఫరెన్స్ నంబర్ వస్తుంది. డ్రాఫ్ట్ సదుపాయం మొత్తం వివరాలు ఒకేసారి నమోదు చేయలేకపోతే డ్రాఫ్ట్‌గా సేవ్ చేసుకుని తర్వాత పూర్తి చేయొచ్చు. గణకుడు వచ్చినప్పుడు ఈ రెఫరెన్స్ నంబర్ చూపిస్తే మళ్లీ వివరాలు చెప్పాల్సిన అవసరం ఉండదు.

Advertisement

వివరాలు

ముఖ్య జాగ్రత్తలు

ఇంటి పెద్ద పేరు, ఫోన్ నంబర్‌తోనే నమోదు ప్రారంభమవుతుంది ఇంగ్లిష్, హిందీతో పాటు 14 ప్రాంతీయ భాషల్లో నమోదు చేసుకోవచ్చు సబ్మిట్ చేసిన తర్వాత పేరు, ఫోన్ నంబర్ మార్చే అవకాశం లేదు గూగుల్ మ్యాప్‌లో ఇంటి లొకేషన్ ఖచ్చితంగా గుర్తించాలి తప్పులు ఉంటే గణకుడు వచ్చినప్పుడు సరిచేసుకోవచ్చు ఏవైనా సందేహాలు ఉంటే జాతీయ హెల్ప్‌లైన్ నంబర్ 1855ను సంప్రదించవచ్చు. ఇది ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేస్తుంది. సెల్ఫ్ ఎన్యుమరేషన్ ద్వారా ప్రజలు సులభంగా, వేగంగా తమ వివరాలు నమోదు చేసుకునే అవకాశం లభిస్తోంది. అయితే ఇది తప్పనిసరి కాదు. గణకుడు ఇంటికి వచ్చినప్పుడు కూడా వివరాలు అందించవచ్చు.

Advertisement