LOADING...
IndiGo Refund Issue: రేపటిలోపు రీఫండ్ పూర్తిచేయండి… ఇండిగోకు కేంద్రం డెడ్‌లైన్ ఫిక్స్!
రేపటిలోపు రీఫండ్ పూర్తిచేయండి… ఇండిగోకు కేంద్రం డెడ్‌లైన్ ఫిక్స్!

IndiGo Refund Issue: రేపటిలోపు రీఫండ్ పూర్తిచేయండి… ఇండిగోకు కేంద్రం డెడ్‌లైన్ ఫిక్స్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 06, 2025
04:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ విమానయాన సంస్థ 'ఇండిగో' సర్వీసుల్లో చోటుచేసుకున్న తీవ్రమైన అంతరాయాల కారణంగా ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకోలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వందల సంఖ్యలో విమానాలు రద్దు కావడంతో సీనియర్ సిటిజన్లు, విద్యార్థులు, వైద్య అవసరాల కోసం ప్రయాణించాల్సిన వారు సీట్లు దొరక్క ఇబ్బంది పడ్డారు. ఈ పరిస్థితుల్లో విమాన టికెట్ ధరలు అధికంగా పెరగకుండా నియంత్రణ అవసరమని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ నిబంధనలు ఎవరైనా ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు హెచ్చరించారు. ఎయిర్‌లైన్స్, ట్రావెల్ ప్లాట్‌ఫారమ్‌లపై ప్రభుత్వం పూర్తి దృష్టి పెట్టి ధరలను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు.

Details

డిసెంబర్ 7లోగా చెల్లించాలి

కరోనా సమయంలో కూడా ఇలాగే ధరల పరిమితులు అమలు చేశామని గుర్తు చేశారు. అలాగే పెండింగ్‌లో ఉన్న రీఫండ్‌లను తక్షణమే చెల్లించాలని ఆదేశాలిచ్చారు. రద్దైన, ఆలస్యమైన విమాన సర్వీసులకు సంబంధించిన రీఫండ్ ప్రక్రియను డిసెంబర్ 7 రాత్రి 8 గంటలలోపు పూర్తి చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రద్దు కారణంగా ఇబ్బందులు పడ్డ ప్రయాణికులపై రీ-షెడ్యూలింగ్ ఛార్జీలు విధించొద్దని కూడా పేర్కొన్నారు. అదేవిధంగా ప్రయాణికుల లగేజ్‌ను 48 గంటల్లోపు అందజేయాలని సూచిస్తూ, ఈ ఆదేశాలను నిర్లక్ష్యం చేసినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కొన్ని రోజులుగా ఇండిగో వందల సంఖ్యలో విమానాలను రద్దు చేస్తుండగా, డిసెంబర్ 6న కూడా దేశంలోని అనేక ఎయిర్‌పోర్టుల్లో వందకు పైగా సర్వీసులు రద్దు అయ్యాయి.

Details

సర్వీసులు క్రమంగా పునరుద్ధరణ

ఈ నేపథ్యంలో దిల్లీ ఎయిర్‌పోర్టు ఒక ప్రకటన విడుదల చేస్తూ, విమాన సర్వీసులు క్రమంగా పునరుద్ధరించబడుతున్నప్పటికీ కొన్ని సర్వీసులపై ప్రభావం ఇంకా కొనసాగుతోందని తెలిపింది. భారీ అంతరాయం నేపథ్యంలో ప్రయాణికుల రవాణా ఇబ్బందులు తీరేందుకు రైల్వే శాఖ కూడా రంగంలోకి దిగింది. పలు రైళ్లకు అదనపు బోగీలు జత చేయడంతో పాటు, ప్రత్యేక రైళ్లు నడుపుతూ అత్యవసర పరిస్థితిని ఎదుర్కొంటోంది.

Advertisement