Samagra Kutumba Survey: తెలంగాణలో సమగ్ర కుటుంబ సర్వే ప్రారంభం.. 75 ప్రశ్నలతో డేటా సేకరణ!
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలో సమగ్ర కుటుంబ సర్వే మొదలైంది. వివిధ జిల్లాల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు ఈ సర్వేను ప్రారంభించారు.
ఈ సర్వేలో ప్రభుత్వం ఉద్యోగులు ఇంటింటికీ వెళ్లి సామాజిక, ఆర్థిక పరిస్థితులను తెలుసుకోనున్నారు.
ఈ సర్వేలో ప్రజల ఆస్తులు, అప్పులు, ఆదాయాలు, కుటుంబ సభ్యులు, విదేశాలకు లేదా ఇతర రాష్ట్రాలకు వెళ్లిన వివరాలు, ఉద్యోగ, వృత్తి వంటి 75 రకాల ప్రశ్నలతో డేటా సేకరిస్తున్నారు.
ఈ సర్వేలో కుటుంబ యజమాని, వారి సభ్యుల వివరాలతో పాటు, ప్రతి ఒక్కరి ఫోన్ నంబర్, వృత్తి, ఉద్యోగ వివరాలను నమోదు చేయనున్నారు.
ఇంట్లో ఎవరు విదేశాలకు వెళ్లారు, ఏ కారణం వల్ల వెళ్లారు అన్నది కూడా అడిగే అవకాశం ఉంది.
Details
సమగ్ర సర్వేకు ప్రజల సహకారం అవసరం: మంత్రి శ్రీధర్‌బాబు
ఉన్నత చదువు, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి లేదా ఇతర కారణాలు చెప్పాల్సి ఉంటుంది.
విదేశాలకు వెళ్లిన వారు యూకే, అమెరికా, గల్ఫ్, ఆస్ట్రేలియా, కెనడా, ఐరోపా దేశాలకు వెళ్లినట్లయితే, ప్రతి దేశానికి ప్రత్యేక కోడ్‌ను నమోదు చేయాల్సి ఉంటుంది.
ఈ సర్వేను రంగారెడ్డి జిల్లా శంకరపల్లిలో మంత్రి శ్రీధర్‌బాబు ప్రారంభించారు.
సర్వేను విద్య, ఉపాధి, సామాజిక, ఆర్థిక ప్రణాళికల కోసం చేపట్టినట్లు తెలిపారు. ఈ సర్వే వల్ల రేషన్ కార్డులు లేదా ఆరోగ్య శ్రీ కార్డులు పోతాయని వార్తలను ఆయన ఖండించారు.
సర్వేకు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.
Details
పత్రాలు స్వీకరించము : పొన్నం ప్రభాకర్
ఇంటింటి సర్వేలో ప్రజల సహకారం అత్యంత కీలకమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
పత్రాలు స్వీకరించమని, ప్రజలు స్వచ్ఛందంగా సమాచారాన్ని అందించాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు.
అందరి సూచనల మేరకు ఈ ప్రశ్నలు రూపొందించినట్లు ఆయన పేర్కొన్నారు.
ఈ సర్వే ద్వారా రాష్ట్రం రోల్‌మోడల్‌గా మారగలదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.