ఈపీఎఫ్ అధిక పింఛనదారుల్లో ఆందోళన; ఉమ్మడి ఆప్షన్‌పై ఆధారాలు సమర్పించాలని ఈపీఎఫ్‌వో నోటీసులు
ఈ వార్తాకథనం ఏంటి
ఈపీఎఫ్ పింఛన్‌దారులకు ఉద్యోగుల భవిషనిధి సంస్థ(ఈపీఎఫ్‌వో) షాక్ ఇచ్చింది. అధిక వేతనంపై ఎక్కువ పింఛన్ పొందుతున్న వారికి నోటీసులు జారీ చేసింది. అయితే 2014కంటే ముందు పదవీ విరమణ చేసిన వారికి ఈ నోటీసులను పంపింది.
ఉద్యోగం చేస్తున్నప్పుడు అధిక వేతనంపై ఈపీఎఫ్ చందా చెల్లించేందుకు పేరా 26(6)కింద, పింఛన్ నిధికి 8.33శాతం వాటాను చెల్లించడానికి 11(3)కింద యజమానితో కలసి ఇచ్చిన ఉమ్మడి ఆప్షన్‌కు సంబంధించి ఆధారాలను తెలియపర్చాలని నోటీసులో పేర్కొంది.
వారం రోజుల్లో ఆధారాలను సమర్పించాలని, లేకుంటే చెల్లింపులు చేసిన అధిక మొత్తాన్ని రికవరీ చేస్తామని వెల్లడించింది.
ఈపీఎఫ్ఓ
జాబితాను సిద్ధం చేస్తున్న ఈపీఎఫ్‌వో
2015లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం.. ఇప్పుడు అధిక పింఛన్‌కు అర్హత పొందిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవెట్ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలో దాదాపు 50వేల మంది వరకు ఈ తరహా పింఛన్ పొందే వారు ఉంటాయి.
ఆధారాలను సమర్పించని వారని నుంచి రికవరీ చేసేందుకు ఈ మేరకు ప్రాంతీయ కార్యాలయాల్లో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని ఈపీఎఫ్‌వో నిర్ణయించింది.
ఇప్పటికే ఈపీఎఫ్‌వో.. అధిక పింఛన్ పొందుతున్న వారి జాబితాను సిద్ధం చేసే పనిలో పడింది.