Page Loader
యాక్టివ్ ఉద్యోగుల కంటే పెన్షనర్ల సంఖ్య ఎక్కువ: కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్
యాక్టివ్ ఉద్యోగుల కంటే పెన్షనర్ల సంఖ్య ఎక్కువ: కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్

యాక్టివ్ ఉద్యోగుల కంటే పెన్షనర్ల సంఖ్య ఎక్కువ: కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్

వ్రాసిన వారు Stalin
Mar 01, 2023
12:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

పని చేస్తున్న ఉద్యోగుల సంఖ్య కంటే కేంద్ర ప్రభుత్వం నుంచి పెన్షన్ తీసుకుంటున్న వారి సంఖ్యే ఎక్కువని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. యాక్టివ్‌గా పని చేస్తున్న వారు 60 లక్షల మంది వరకు ఉంటే, పెన్షనర్లు 77లక్షల మంది ఉన్నారని చెప్పారు. 49వ ప్రీ-రిటైర్మెంట్ కౌన్సెలింగ్ వర్క్‌షాప్‌లో ఆయన మాట్లాడారు. దాదాపు 6,000-7,000 మంది పింఛనుదారులు '100 ఏళ్లు పైబడిన' ఉన్నారని ఈ సందర్భంగా సిబ్బంది మంత్రి కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. వారు జీతంగా సంపాదించిన మొత్తాన్ని పెన్షన్‌గా తీసుకుంటున్నట్లు వివరించారు. దాదాపు లక్ష మంది పింఛనుదారులు 90ఏళ్ల నుంచి 100ఏళ్ల వయస్సు మధ్య ఉన్నట్లు చెప్పారు.

పింఛన్

ఆన్‌లైన్‌లోకి 11.25 లక్షల మంది పింఛనుదారులు

100 ఏళ్లు పైబడిన పింఛన్‌దారులు లక్ష మందికి పైగా ఉండే రోజు కోసం ఎదురు చూస్తున్నామని జితేంద్ర సింగ్ వ్యాఖ్యానించారు. విడాకులు తీసుకున్న కుమార్తెలు కుటుంబ పెన్షన్‌కు అర్హులని పేర్కొన్నారు. పింఛను/కుటుంబ పింఛన్‌కు సంబంధించిన ఏడేళ్ల సర్వీసు అర్హతను రద్దు చేశామన్నారు. 11.25 లక్షల మంది పింఛనుదారులందరినీ ఆన్‌లైన్‌లోకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని పెన్షన్లు & పెన్షనర్ల సంక్షేమ శాఖ కార్యదర్శి వి.శ్రీనివాస్ తెలిపారు.