Page Loader
Metro Express-Buspass: మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్‌పాస్‌తో ప్రయాణించే వారికి ఆర్టీసీ బంపర్‌ ఆఫర్‌
మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్‌పాస్‌తో ప్రయాణించే వారికి ఆర్టీసీ బంపర్‌ ఆఫర్‌

Metro Express-Buspass: మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్‌పాస్‌తో ప్రయాణించే వారికి ఆర్టీసీ బంపర్‌ ఆఫర్‌

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 12, 2024
11:20 am

ఈ వార్తాకథనం ఏంటి

హైదరాబాద్‌ నగరంలో మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్‌పాస్‌తో ప్రయాణించే ప్రయాణికులకు ఆర్టీసీ అద్భుతమైన ఆఫర్‌ను ప్రకటించింది. ఈ పాస్‌ చూపించిన ప్రతిఒకరు,మంగళవారం(12వ తేదీ)నుంచి లహరి,రాజధాని, గరుడ ప్లస్, ఈ-గరుడ వంటి ఏసీ సర్వీసుల్లో టికెట్‌ ధరపై 10 శాతం రాయితీ పొందగలుగుతారు. ఈ ఆఫర్‌ తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలకు ప్రయాణించే టీజీఎస్‌ఆర్టీసీ బస్సులకు కూడా వర్తిస్తుంది. మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్‌పాస్‌ తీసుకున్న వారు, అలాగే మెట్రో డీలక్స్, గ్రీన్‌ మెట్రో, ఎయిర్‌పోర్టు పుష్పక్‌ బస్‌పాస్‌ ఉన్న వారు కూడా ఈ రాయితీకి అర్హత సాధిస్తారు. ఈ ఆఫర్‌ 2025 జనవరి 31 వరకు కొనసాగుతుందని అధికారులు తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రయోజనకరంగా వినియోగించుకోవాలని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ విజ్ఞప్తి చేశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

సజ్జనార్ చేసిన ట్వీట్