కాంగ్రెస్ ప్లీనరీలో రోశయ్య, జైపాల్‌రెడ్డికి సంతాపం; రెండోరోజు సెషన్‌కు సోనియా, రాహుల్ హాజరు
ఈ వార్తాకథనం ఏంటి
ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ 85వ ప్లీనరీ రెండో రోజు సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు గైర్హాజరైన అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ శనివారం ప్లీనరీలో పాల్గొన్నారు.
రెండో రోజు సెషన్‌లో అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో పాటు కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీ పార్టీ నాయకులను ఉద్దేశించి కీలక ప్రసంగం చేయనున్నారు. ఈ సందర్భంగా రాజకీయ, అంతర్జాతీయ వ్యవహారాలపై ఈ సందర్భంగా ప్లీనరీ సమావేశంలో చర్చించనున్నారు.
రెండవ రోజు సమావశం ప్రారంభం సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షుడు పార్టీ పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా పార్టీ ప్రధాన కార్యదర్శులు తమ సంబంధిత నివేదికలను సమర్పించారు.
కాంగ్రెస్
దివంగత తెలుగు నేతలకు కాంగ్రెస్ ప్లీనరీలో సంతాపం
ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో మరణించిన కాంగ్రెస్ నాయకులకు ప్లీనరీలో సంతాపం తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం రోశయ్య, కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి, మాజీ మంత్రి ముఖేష్ గౌడ్, సబ్బం హరి, వట్టి వసంతకుమార్ తోపాటు పలువురు నేతలను ప్లీనరీలో స్మరించుకున్నారు.
తొలిరోజు జరిగిన సెషన్‌లో సీడబ్ల్యూసీ (కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ) ఎన్నికలు వద్దంటూ తీర్మానించారు. సీడబ్ల్యూసీ సభ్యులందరినీ నామినేట్ చేసే అధికారాన్ని పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు ఇవ్వాలని కాంగ్రెస్ స్టీరింగ్ కమిటీ నిర్ణయించింది.