Page Loader
ఛత్తీస్‌గఢ్‌లో రోడ్డు ప్రమాదం: ట్రక్కు, వ్యాన్ ఢీకొని 11 మంది మృతి
ఛత్తీస్‌గఢ్‌లో రోడ్డు ప్రమాదం: ట్రక్కు, వ్యాన్ ఢీకొని 11 మంది మృతి

ఛత్తీస్‌గఢ్‌లో రోడ్డు ప్రమాదం: ట్రక్కు, వ్యాన్ ఢీకొని 11 మంది మృతి

వ్రాసిన వారు Stalin
Feb 24, 2023
09:48 am

ఈ వార్తాకథనం ఏంటి

ఛత్తీస్‌గఢ్‌లోని బలోడా బజార్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రక్కును పికప్ వ్యాన్ ఢీకొన్న ఘటనలో కనీసం 11మంది మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పికప్ వాహనం- ట్రక్కును ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నట్లు సబ్-డివిజనల్ పోలీస్ ఆఫీసర్ సిద్ధార్థ బఘేల్ తెలిపారు.భటపరా (రూరల్) పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖమారియా గ్రామంలో ఈ సంఘటన జరిగినట్లు వెల్లడించారు. వ్యాను ఒక ఫంక్షన్ నుంచి తిరిగి వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరగ్గా, అందులోని పదకొండు మంది మృతి చెందగా, మరో ఎనిమిది మంది గాయపడ్డారు.

రోడ్డు ప్రమాదం

గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించిన పోలీసులు

స్థానికుల సహాయంతో గాయపడిన వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు పోలీస్ ఆఫీసర్ సిద్ధార్థ బఘేల్ వెల్లడించారు. వారిలో కొందరిని మెరుగైన వైద్య సహాయం కోసం రాయ్‌పూర్‌కు తీసుకెళ్లినట్లు చెప్పారు. ఈ ప్రమాదంపై ఇప్పటికే కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తును ప్రారంభించారు. ఇదిలా ఉంటే, ఫిబ్రవరి 9న చత్తీస్‌గఢ్‌లోని కంకేర్ జిల్లాలో స్కూల్ పిల్లలను తీసుకెళ్తున్న ఆటో-రిక్షా ట్రక్కును ఢీకొనడంతో ఏడుగురు పాఠశాల విద్యార్థులు మరణించగా, ఒక చిన్నారి మరియు ఆటో డ్రైవర్ గాయపడ్డారని ఒక అధికారి తెలిపారు.