NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ఎస్సీ, ఎస్టీలపై కాంగ్రెస్ వరాల జల్లు.. 12అంశాలతో డిక్లరేషన్‌
    తదుపరి వార్తా కథనం
    ఎస్సీ, ఎస్టీలపై కాంగ్రెస్ వరాల జల్లు.. 12అంశాలతో డిక్లరేషన్‌
    ఎస్సీ, ఎస్టీలపై కాంగ్రెస్ వరాల జల్లు

    ఎస్సీ, ఎస్టీలపై కాంగ్రెస్ వరాల జల్లు.. 12అంశాలతో డిక్లరేషన్‌

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Aug 27, 2023
    10:21 am

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణలోని చేవెళ్లలో శనివారం కాంగ్రెస్ ప్రజా గర్జన సభ నిర్వహించింది.ఈ మేరకు 12 అంశాలతో కూడిన డిక్లరేషన్ ప్రకటించింది. ఇందులో భాగంగా ఎస్సీ, ఎస్టీ వర్గాలపై వరాల జల్లు కురిపించింది. కాంగ్రెస్ అధికారంలోకి తీసుకొస్తే అంబేేేద్కర్ అభయహస్తం పథకం కింద రూ.12లక్షలను ఇస్తామని వెల్లడించింది.

    తమ ప్రభుత్వం ఏర్పడగానే రిజర్వేషన్లను పెంచుతామని స్పష్టం చేసింది.ఈ క్రమంలోనే ఎస్సీలకు 18శాతం, ఎస్టీలకు 12శాతం రిజర్వేషన్లు పెంచుతామని డిక్లరేషన్‌లో పేర్కొంది.

    మరోవైపు ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న ఎస్సీ వర్గీకరణను సైతం చేపడతామన్నారు. ఈ నేపథ్యంలోనే దళితులను ఏ, బీ, సీ, డీలుగా వర్గీకరిస్తామని హామీ ఇచ్చింది.

    కాంట్రాక్ట్ పనులు, ప్రైవేట్ సంస్థల ఉద్యోగాల్లోనూ ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పింది.

    details

    ఎస్సీ, ఎస్టీలకు కేసీఆర్‌ సర్కార్ తీవ్ర అన్యాయం : మల్లిఖార్జున ఖర్గే

    గృహ నిర్మాణానికి రూ.6 లక్షలు ఇస్తామని వివరించింది. పదో తరగతి నుంచి పీహెచ్‌డీ వరకు ఉన్న ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలను అందిస్తామని భరోసా ఇచ్చింది.

    గత 9 ఏళ్లుగా ఎస్సీ, ఎస్టీలకు కేసీఆర్‌ సర్కార్ తీవ్ర అన్యాయం చేసిందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే మండిపడ్డారు.

    ఎస్సీ, ఎస్టీ కాంగ్రెస్ డిక్లరేషన్ :

    1. జనాభా ప్రకారం దళిత, గిరిజనులకు రిజర్వేషన్ల పెంపుదల.

    2. ఏ, బీ, సీ, డీలుగా వర్గీకరణ. ప్రతి ఎస్సీ, ఎస్టీ కుటుంబానికి అంబేడ్కర్‌ అభయహస్తం పేరిట రూ. 12 లక్షల ఆర్థిక సాయం.

    3. ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ఎస్సీ, ఎస్టీలకు 18, 12 శాతం రిజర్వేషన్‌ చొప్పున వర్తింపు.

    DETAILS

     2006 అటవీ హక్కుల చట్టం కింద పోడు భూములకు పట్టాలు. 

    4. ఇందిరమ్మ పథకం కింద ఇల్లు లేని ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ఇంటి స్థలం సహా నిర్మాణానికి రూ. 6 లక్షల గ్రాంట్

    5. ప్రైవేట్ విద్యాసంస్థల్లో, ప్రభుత్వ ప్రోత్సాహకాలు పొందే కంపెనీల్లో రిజర్వేషన్లు.

    6. 2013 చట్టం మేరకు పట్టా, ఎసైన్డ్‌ భూములకు పరిహారం అందజేత. పోడు భూముల తాకట్టు లేదా విక్రయించుకునేందుకు పూర్తి హక్కులు. 2006 అటవీ హక్కుల చట్టం కింద పోడు భూములకు పట్టాలు.

    7. బీఆర్ఎస్ సర్కార్ లాక్కున్న ఎసైన్డ్‌ భూములన్నీ మళ్లీ ఆయా బాధితులకే అప్పగింత. అంతేకాకుండా యాజమాన్య హక్కులను అందిస్తామని ప్రకటన

    8. ప్రతి గూడెం, తండా పంచాయతీకి సమ్మక్క సారక్క గిరిజన గ్రామీణ అభివృద్ధి కింద రూ. 25 లక్షల నిధులు

    DETAILS

    ఎస్సీల్లో మాల,మాదిగ, ఉపకులాల వారికి 3 కార్పొరేషన్లు

    9. మైదాన ప్రాంతంలోని ఎస్టీలకు కొత్తగా 5 ఐటీడీఏలు. మొత్తం 9 ఐటీడీఏ కేంద్రాల్లో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణానికి డిక్లరేషన్.

    10. ఎస్సీల్లో మాల, మాదిగ, ఉపకులాల వారికి విడివిడిగా 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఏటా రూ.750 కోట్ల చొప్పున నిధులు విడుదల.

    11. తుకారాం,ఆదివాసీ, సంత్‌ సేవాలాల్‌ లంబాడా, ఎరుకలకు వేర్వేరు కార్పొరేషన్లు. ఒక్కోదానికి రూ.500 కోట్లు ఇస్తామని ప్రకటన

    12. దళిత, గిరిజన విద్యార్థులకు విద్యాజ్యోతి కింద పది పాసైతే రూ.10 వేలు, ఇంటర్‌ కు రూ.15 వేలు,డిగ్రీ పాసైతే రూ.25 వేలు,ఎంఫిల్‌, పీహెచ్‌డీలకు రూ.5 లక్షల బహుమానం.ప్రతి మండలంలో గురుకుల పాఠశాల ఏర్పాటు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, విదేశాల్లో సీటు వస్తే నిధుల మంజూరు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కాంగ్రెస్
    మల్లికార్జున ఖర్గే
    తెలంగాణ
    రేవంత్ రెడ్డి

    తాజా

    Covid 19 : హాంకాంగ్, సింగపూర్ లో మళ్ళీ పెరుగుతున్న కోవిడ్ కేసులు కోవిడ్
    India Womens Squad : హర్మన్ ప్రీత్ సారథ్యంలో ఇంగ్లండ్ టూర్ కు వెళ్తున్న వుమెన్స్ జట్టు ఇదే.. బీసీసీఐ
    Turkey: టర్కీపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం.. ఒప్పందాలు రద్దు చేసుకుంటున్న భారత యూనివర్సిటీలు.. బాయ్‌కాట్‌ టర్కీ
    India Turkey: టర్కీకి బిగ్ షాక్ ఇచ్చిన భారత్.. విమానయాన సంస్థతో ఒప్పందం రద్దు.. కేంద్ర ప్రభుత్వం

    కాంగ్రెస్

    కేరళ మాజీ సీఎం ఊమెన్‌ చాందీ కన్నుమూత కేరళ
    Opposition 26 vs NDA 38: పోటాపోటీగా అధికార, ప్రతిపక్షాల సమావేశాలు ప్రతిపక్షాలు
    ప్రధాని పదవిపై కాంగ్రెస్‌కు ఆసక్తి లేదు.. విపక్షాల భేటీలో ఖర్గే కీలక వ్యాఖ్యలు మల్లికార్జున ఖర్గే
    Opposition Meeting: 26 ప్రతిపక్షాల కూటమి పేరు 'I-N-D-I-A' గా ఖరారు ప్రతిపక్షాలు

    మల్లికార్జున ఖర్గే

    ప్రభుత్వాన్ని నియంతలా నడుపుతున్న ప్రధాని మోదీ: కాంగ్రెస్ చీఫ్ ఖర్గే కాంగ్రెస్
    రాహుల్ గాంధీకి మద్దతుగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా సత్యాగ్రహాలు కాంగ్రెస్
    రాహుల్ కోసం నా బంగ్లాను ఖాళీ చేస్తా: కాంగ్రెస్ చీఫ్ ఖర్గే రాహుల్ గాంధీ
    దేశంలోని ప్రతిపక్షాలను ఏకం చేయడంలో చారిత్రక అడుగు వేశాం: రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ

    తెలంగాణ

    బీజేపీకి మాజీ మంత్రి చంద్రశేఖర్ రాజీనామా; కాంగ్రెస్‌లోకి ఆహ్వానించిన రేవంత్ బీజేపీ
    గ్రూప్‌-2 కొత్త షెడ్యూల్ రిలీజ్.. నవంబర్‌ తొలి వారంలోనే పరీక్షలు కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)
    ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ గుడ్‌ న్యూస్.. టిక్కెట్ ధరలపై భారీగా డిస్కౌంట్  టీఎస్ఆర్టీసీ
    అమరవీరులకు సీఎం కేసీఆర్‌ శ్రద్ధాంజలి.. కోటలో కొనసాగుతున్న స్వాతంత్ర వేడుకలు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)

    రేవంత్ రెడ్డి

    రేవంత్ రెడ్డి కాన్వాయ్‌కు భారీ ప్రమాదం; కార్లు ధ్వంసం కాంగ్రెస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025