Page Loader
Rahul Gandhi: రైతన్నగా మారిన రాహుల్ గాంధీ; పొలం దున్ని, నాటు వేసిన కాంగ్రెస్ నేత 
రైతన్నగా మారిన రాహుల్ గాంధీ; పొలం దున్ని, నాటు వేసిన కాంగ్రెస్ నేత

Rahul Gandhi: రైతన్నగా మారిన రాహుల్ గాంధీ; పొలం దున్ని, నాటు వేసిన కాంగ్రెస్ నేత 

వ్రాసిన వారు Stalin
Jul 08, 2023
06:52 pm

ఈ వార్తాకథనం ఏంటి

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రైతన్న అవతారమెత్తారు. హర్యానాలోని సోనిపట్ జిల్లాలో శనివారం ఆకస్మిక పర్యటన చేశారు. అక్కడి వ్యవసాయ పొలాలకు వెళ్లి రైతులను ఆశ్చర్య పరిచారు. అక్కడి రైతులతో మమేకమయ్యారు. ట్రాక్టర్‌తో రాహుల్ గాంధీ పొలం దున్నారు. ఆ తర్వాత రైతులు, కూలీలతో కలిసి నాట్లు కూడా వేశారని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్బీర్ సింగ్ మాలిక్ తెలిపారు. కాంగ్రెస్ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ నుంచి రాహుల్ గాంధీ నాట్లు వేసిన ఫొటోలు, అక్కడి రైతులతో మాట్లాడిన దృశ్యాలను విడుదల చేశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

పొలంలో రైతులతో మమైకమైన రాహుల్ గాంధీ

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ట్రాక్టర్‌తో పొలం దున్నుతున్న రాహుల్

ట్విట్టర్ పోస్ట్ చేయండి

రైతులతో సరదాగా నాటు వేస్తున్న రాహుల్ గాంధీ