తదుపరి వార్తా కథనం

Prajwal Shetty: కాంగ్రెస్ నేత కొడుకు ర్యాష్ డ్రైవింగ్.. ఒకరు దుర్మరణం
వ్రాసిన వారు
Jayachandra Akuri
Nov 17, 2024
04:43 pm
ఈ వార్తాకథనం ఏంటి
కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దేవి ప్రసాద్ శెట్టి కుమారుడు ప్రాజ్వల్ శెట్టి ర్యాష్ డ్రైవింగ్ కారణంగా ఒకరు మృతి చెందారు.
ఊడుపి జిల్లా షిర్వా వద్ద 39 ఏళ్ల మోహమ్మద్ హుస్సేన్‌ను SUV తో ఢీకొట్టి అతని మరణానికి కారణమయ్యారు.
నవంబర్ 13 న ఉదయం 5 గంటల సమయంలో ప్రాజ్వల్ డ్రైవ్ చేసిన థార్ ఎస్‌యూవీ, మోటార్సైకిల్‌ను బలంగా ఢీకొన్నట్లు సీసీటీవీ ఫుటేజీలో కనిపించింది.
ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ హుస్సేన్ ను వెంటనే ఆసుపత్రికి తరలించారు.
Details
కేసు నమోదు చేసుకున్న పోలీసుల
కానీ మరుసటి రోజు ఆయన చికిత్స పొందుతూ మరణించారు. ఈ ఘటనపై షిర్వా పోలీసులు ప్రాజ్వల్‌ను నవంబర్ 14 న అరెస్టు చేశారు.
అయితే నిందితుడిని అరెస్టు చేసిన వెంటనే బెయిల్‌పై విడుదలయ్యాడు. దేవీప్రసాద్ ప్రస్తుతం కోఅపరేటివ్ సోసైటీ సెక్రటరీగా పనిచేస్తున్నారు.