Page Loader
Congress: కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజా వెంకటప్ప కన్నుమూత 
Congress: కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజా వెంకటప్ప కన్నుమూత

Congress: కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజా వెంకటప్ప కన్నుమూత 

వ్రాసిన వారు Stalin
Feb 25, 2024
05:19 pm

ఈ వార్తాకథనం ఏంటి

కాంగ్రెస్ పార్టీలో విషాధం చోటుచేసుకుంది. కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజా వెంకటప్ప నాయక్ (67) గుండెపోటుతో కన్నుమూశారు. మల్టీ ఆర్గాన్ ఫెల్యూర్‌తో బాధపడుతున్న ఎమ్మెల్యే రాజా వెంకటప్ప నాయక్‌ను కుటుంబ సభ్యులు నిమిత్తం నగరంలోని మణిపాల్ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతున్న సమయంలో ఆయనకు గుండెపోటు రావడంతో ఆదివారం తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఎమ్మెల్యే రాజా వెంకటప్పకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. యాదగిరి జిల్లాలోని సూర్పురా నియోజకవర్గం నుంచి రాజా వెంకటప్ప ఎమ్మెల్యేగా ఉన్నారు. సూర్పురా నియోజకవర్గం నుంచి ఆయన నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యే రాజా వెంకటప్ప నాయక్ మృతికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సహా కాంగ్రెస్ నేతలు సంతాపం తెలిపారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సంతాపం