Congress: కాంగ్రెస్‌లో భారీ మార్పులు.. తెలంగాణకు కొత్త ఇన్‌చార్జ్.. సచిన్‌కు కీలక బాధ్యతలు
2024లో జరగనున్న లోక్‌సభ ఎన్నికలే టార్గెట్‌గా సంస్థాగతమైన మార్పులను కాంగ్రెస్ పార్టీ చేపట్టింది. ఈ క్రమంలో భారీ మార్పులు చేసింది. 12 మంది ప్రధాన కార్యదర్శులను పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే నియమించారు. అలాగే 12 రాష్ట్రాలకు కొత్త ఇన్‌చార్జ్‌లను ప్రకటించారు. ఉత్తర్‌ప్రదేశ్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా అవినాష్ పాండేకు బాధ్యతలు అప్పగించారు. ఇప్పటిదాకా యూపీకి బాధ్యతలను చూసిన ప్రియాంక గాంధీకి ఏ రాష్ట్రాన్ని కేటాయించలేదు. మరోవైపు రాజస్థాన్‌లో కీలక నేత సచిన్ పైలట్‌కు కీలక బాధ్యతలు అప్పగించారు. ఆయన్ను ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్‌గా నియమించారు. ఇప్పటి వరకు ఛత్తీస్‌గఢ్ ఇన్‌ఛార్జ్‌గా జనరల్ సెక్రటరీ కుమారి సెల్జా బాధ్యతలు నిర్వర్తించారు. ఇప్పుడు ఆయనకు ఉత్తరాఖండ్ బాధ్యతలు అప్పగించారు.
తెలంగాణ ఇన్‌ఛార్జ్‌గా దీపా దాస్‌మున్షీ
మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, మిజోరాం ఇన్‌ఛార్జ్‌లను కూడా ఖర్గే మార్చారు. రాజస్థాన్ ఇన్‌ఛార్జ్‌గా సుఖ్‌జిందర్ సింగ్ రంధావాను కొనసాగించారు. ఇటీవల జరిగిన రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం తెలంగాణలో మాత్రమే కాంగ్రెస్ విజయం సాధించింది. తెలంగాణ ఇన్ చార్జ్‌ను కూడా అధిష్టానం మార్చింది. తెలంగాణ ఇన్‌ఛార్జ్‌గా మాజీ ఎంపీ దీపా దాస్‌మున్షీని నియమించారు. ఈమె కేరళ, లక్షద్వీప్‌ల ఇన్‌ఛార్జ్ బాధ్యతలను కూడా నిర్వర్తించనున్నారు. మధ్యప్రదేశ్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలను జితేంద్ర సింగ్‌కు అప్పగించారు. కర్ణాటక ఇన్‌ఛార్జ్‌గా రణదీప్ సింగ్ సూర్జేవాలాను నియమించారు. ఇప్పటిదాకా తెలంగాణ ఇన్‌ఛార్జ్‌గా ఉన్న మాణిక్‌రావు ఠాక్రేను గోవా ఇన్‌ఛార్జ్‌గా నియమించారు.