Loading...
Congress Slams PM Modi: మోదీ 'దిమాగీ నక్సల్స్‌' వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ తీవ్ర విమర్శలు
మోదీ 'దిమాగీ నక్సల్స్‌' వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ తీవ్ర విమర్శలు

Congress Slams PM Modi: మోదీ 'దిమాగీ నక్సల్స్‌' వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ తీవ్ర విమర్శలు

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 09, 2026
01:46 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రధాని నరేంద్ర మోదీ 'దిమాగీ నక్సల్స్‌' అంటూ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా విమర్శలు గుప్పించింది. ఈ వ్యాఖ్యల వెనుక ప్రధాన ఉద్దేశం ఏమిటని ప్రశ్నించింది. 'దిమాగీ నక్సల్స్‌' పేరుతో యువతపై భద్రతా బలగాలను ప్రయోగించాలనుకుంటున్నారా? అని నిలదీసింది. యువతపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా మోదీ ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారని కాంగ్రెస్‌ ఎంపీ పవన్‌ ఖేరా ప్రశ్నించారు.

వివరాలు 

యువతపై ప్రధాని ఇలాంటి పదాలు వాడటం సరికాదు: ఖేరా

ఈ మేరకు సోమవారం ఆయన ఎక్స్‌(ట్విటర్‌)వేదికగా స్పందించారు.

దేశంలోని యువతపై ప్రధాని మోదీ ఈ తరహా వ్యాఖ్యలు చేయడాన్ని ఖేరా తప్పుబట్టారు.

గతంలో ఆగస్టు 15న ఎర్రకోట నుంచి ప్రసంగించిన సమయంలోనూ మోదీ 'దిమాగీ నక్సల్స్‌' అనే పదాన్ని ఉపయోగించారని గుర్తుచేశారు.

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు వ్యతిరేకంగా నిరసన తెలిపిన యువతను ఉద్దేశించే అప్పట్లో ఈ వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు.

అవినీతిపరుడు,అసమర్థుడైన విద్యాశాఖ మంత్రికి వ్యతిరేకంగా నిరసన తెలిపిన యువతపై ప్రధాని ఇలాంటి పదాలు వాడటం సరికాదన్నారు.

ఇప్పుడు దేశ భద్రతా బలగాలు యువతపై యుద్ధం చేయాలని ప్రధాని కోరుకుంటున్నారా? అని ప్రశ్నించారు.

దీపావళి సందర్భంగా సైనికుల మధ్య కూడా ఇదే వ్యాఖ్యలు చేయడం చౌకబారు రాజకీయాలకు నిదర్శనమని విమర్శించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

పవన్‌ ఖేరా చేసిన ట్వీట్ 

ADVERTISEMENT

వివరాలు 

బస్తర్‌లో మోదీ ఏమన్నారంటే?

ఆదివారం ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌లో దీపావళి వేడుకల సందర్భంగా భద్రతా సిబ్బందిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు.

దేశంలో నక్సలిజం ముప్పు ఇంకా పూర్తిగా తొలగిపోలేదని హెచ్చరించారు.

అడవుల్లో సాయుధ నక్సలైట్లను అంతమొందించినప్పటికీ.. 'దిమాగీ నక్సల్స్‌' పేరుతో వివిధ సంస్థలు, రాజకీయ పార్టీల్లోకి చొరబడి రాజ్యాంగం, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొడుతున్నారని మోదీ ఆరోపించారు.

ఇలాంటి శక్తులు దేశానికి ఇంకా సవాల్‌గా మారాయని మోదీ అన్నారు.

ADVERTISEMENT