
Maharashtra: 'ఇండియా' కూటమి పొత్తు ఖారారు.. 18స్థానాల్లో కాంగ్రెస్ పోటీ
ఈ వార్తాకథనం ఏంటి
మహారాష్ట్రలో కూడా 'ఇండియా' కూటమి మధ్య సీట్ల పంపకంపై ఏకాభిప్రాయం కుదిరింది.
శివసేన (ఉద్ధవ్ వర్గం) రాష్ట్రంలో 20స్థానాల్లో, కాంగ్రెస్ 18స్థానాల్లో, శరద్ పవార్ పార్టీ 10స్థానాల్లో పోటీ చేయనుంది.
సీట్ల పంపకానికి సంబంధించి ఇంతకుముందు జరిగిన చర్చలో 40సీట్లపై ఏకాభిప్రాయం కుదిరింది. అయితే కొన్ని సీట్లపై భిన్నాభిప్రాయాలు వచ్చినట్లు తెలుస్తోంది.
మహారాష్ట్రలోని మహా వికాస్ అఘాడీ కూటమి 2024 లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన సీట్ల పంపకాన్ని దాాదాపు పూర్తి చేసింది. మరో 48గంటల్లో దీనిపై అధికారికంగా ప్రకటన రావొచ్చు.
3ప్రధాన పార్టీలతో పాటు, వంచిత్ బహుజన్ అఘాడీ వంటి ప్రాంతీయ పార్టీలకు శివసేన(ఉద్ధవ్ వర్గం) నుంచి 2సీట్లు, స్వతంత్ర అభ్యర్థి రాజు శెట్టికి పవార్ పోర్షన్ నుంచి టిక్కెట్ లభించనుంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
20స్థానాల్లో ఉద్ధవ్ వర్గం పోటీ
🔴#ElectionsWithNDTV | Maharashtra Opposition Seat Deal Finalised, Congress To Contest 18 Seats https://t.co/5jAYcNDPBm@rounakview reports pic.twitter.com/F0o285HEZi
— NDTV (@ndtv) March 1, 2024