అజ్మీర్‌లో భారీ రైలు ప్రమాదానికి కుట్ర.. ట్రాక్ పై సిమెంట్ దిమ్మెను పెట్టిన దుండగలు
రాజస్థాన్‌లోని అజ్మీర్ వద్ద దారుణమైన రైలు ప్రమాదానికి కుట్ర జరిగినట్టు తెలుస్తోంది. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రైల్వే ట్రాక్‌పై సిమెంట్ దిమ్మెను ఉంచారు. వేగంగా వచ్చిన రైలు ఆ దిమ్మెను బలంగా ఢీకొట్టడంతో ఇంజిన్‌కు తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ నేపథ్యంలో ట్రాక్ కూడా దెబ్బతింది. లోకో పైలట్ అప్రమత్తంగా వ్యవహరించి, వెంటనే ఈ విషయాన్ని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) అధికారులకు తెలియజేశారు.
దర్యాప్తు సాగిస్తున్న పోలీసులు
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో భాగంగా ఈ కుట్రలో ఒకరి కంటే ఎక్కువ మంది ప్రమేయం ఉన్నట్లు భావిస్తున్నారు. రెండు రోజుల క్రితం కాన్పూర్‌లో జరిగిన మరో ఘటనలో ఇదే విధమైన కుట్ర బయటికొచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ రెండు ఘటనలు సంబంధం ఏమైనా కలిగి ఉందనే అనుమానంతో కూడా పోలీసుల దర్యాప్తు సాగుతోంది.