
Mamata Banerjee: రాత్రి పూట అమ్మాయిలు బయటకి రాకూడదు : మమతా బెనర్జీ వ్యాఖ్యలపై వివాదం
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్‌లోని ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీ రెండో సంవత్సర వైద్య విద్యార్థినిపై దారుణ సామూహిక అత్యాచార ఘటన చోటుచేసుకుంది. రాత్రి సమయంలో బయటకు వచ్చిన విద్యార్థినిని ఐదుగురు దుండగులు క్యాంపస్ సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పటికీ, మిగిలిన ఇద్దరి కోసం సోదాలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనపై పశ్చిమబెంగాల్ సీఎం, టీమ్సీ అధినేత మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. రాత్రి సమయంలో అమ్మాయిలు బయటకు వెళ్ళకూడదని, విద్యార్థిని భద్రతను కాలేజ్ యాజమాన్యం చూసుకోవాల్సిందని చెప్పారు.
Details
వ్యక్తిగత జాగ్రత్తలు కూడా అవసరం
ముఖ్యంగా రాత్రిపూట ఆడపిల్లలు తమను తాము రక్షించుకోవాలి. ప్రభుత్వం అన్ని బాధ్యతలు తీసుకున్నప్పటికీ, వ్యక్తిగత జాగ్రత్తలు కూడా అవసరమని పేర్కొన్నారు. అలాగే ఆమె తన ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడం అన్యాయమని, బాధ్యత కల్పించాల్సినది కాలేజీనే అని స్పష్టం చేశారు. గతంలో ఒడిశాలోని పూరీ బీచ్‌లో చోటుచేసుకున్న గ్యాంగ్‌రేప్ ఘటనకు ప్రభుత్వ చర్యలు ఎందుకు తీసుకోలేదని కూడా ఆమె ప్రశ్నించారు. 23 ఏళ్ల విద్యార్థిని అర్థరాత్రి క్యాంపస్ నుండి ఎలా బయటకు వచ్చిందో కూడా మమతా బెనర్జీ చర్చించారు. "ఆమె ప్రైవేట్ వైద్య కళాశాలలో చదువుతోంది. ఈ పరిస్థితిలో బాధ్యత ఎవరిదని ఆమె ప్రశ్నించారు.