Drugs: రూ. 2,500 కోట్లు విలువ చేసే డ్రగ్స్‌ను పట్టివేత
దిల్లీ, పూణెలో రెండు రోజుల పాటు స్పెషల్ ఆపరేషన్ నిర్వహించిన పోలీసులు 1,100కిలోలో నిషేధిత డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్ పేరు మెఫెడ్రోన్. లోకల్‌గా మియావ్ మియావ్ అని పిలుస్తుంటారు. వీటి విలువ రూ. 2,500కోట్లు అని అధికారులు అంచనా వేస్తున్నారు. పూణెలో ముగ్గురు డ్రగ్ స్మగ్లర్లను అరెస్టు చేసిన తర్వాత ఈ ఆపరేషన్ ను ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. వీరి వద్ద 700కిలోలో మెఫెడ్రోన్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ ముగ్గురిని అరెస్ట్ చేసి విచారించిన తర్వాత దిల్లీలోనిహౌజ్ ఖాస్ ప్రాంతంలో మరో 400కేజీల డ్రగ్స్ గుర్తించినట్లు తెలిపారు. పుణెలోని కుర్కుంభ్ ఎంఐడీసీ ప్రాంతంలో మెఫెడ్రోన్ డ్రగ్ భారీగా ఉన్నట్లు మొదట గుర్తించి సోదాలు చేసినట్లు వివరించారు.
మహారాష్ట్రలో అతిపెద్ద డ్రగ్ బరస్ట్
మహారాష్ట్రలో ఇప్పటివరకు ఇదే అతిపెద్ద డ్రగ్ రికవరీ అని పూణె పోలీసులు తెలిపారు. దేశంలోని అతిపెడ్డ డ్రాగ్ బరస్ట్ లలో ఇది కూడా ఒకటని పేర్కొన్నారు. కుర్కుంభ్ ఎంఐడీసీ నుంచి ఢిల్లీలోని స్టోరేజీ ఫెసిలిటీలకు నిషేధిత డ్రగ్స్ ను రవాణా చేస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తెలిసిందని పోలీసులు వివరించారు. ఈ సోదాల్లో మొత్తం ఐదుగురిని అరెస్టు చేసినట్లు తెలిపారు. అరెస్టయిన వారిలో ముగ్గురు కొరియర్ బాయ్స్ ఉన్నట్లు పూణె పోలీస్ కమిషనర్ అమితేష్ కుమార్ తెలిపారు. వీరు గతంలో కూడా నేరాలకు పాల్పడారని, కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. ఈ డ్రగ్ స్మగ్మర్లతో సంబంధాలు ఉన్నవారికి గుర్తించేందుకు ఇతర దర్యాప్తు సంస్థలతో కలిసి ఈ కేసును ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నట్లు పూణె కమిషనర్ తెలిపారు.