Page Loader
దిల్లీలో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు; పాజిటివ్ రేటు 22.74శాతం
దిల్లీలో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు

దిల్లీలో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు; పాజిటివ్ రేటు 22.74శాతం

వ్రాసిన వారు Stalin
Apr 26, 2023
09:52 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశ రాజధాని దిల్లీలో కరోనా విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు కొన్ని రోజులుగా తగ్గుతుంటే, దిల్లీలో మాత్రం భారీగా నమోదవుతున్నాయి. దిల్లీలో ఒక్కరోజే 1,095 తాజా కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. తాజాగా కరోనాతో 6 మరణాలు సంభవించాయి. ఐదుగురు మరణాల విషయంలో ప్రాథమిక కారణం కోవిడ్ కాదని దిల్లీ ప్రభుత్వ ఆరోగ్య శాఖ చెప్పింది. అయితే పాజిటివిటీ రేటు 22.74శాతంగా ఉన్నట్లు పేర్కొంది. తాజా మరణాలతో దిల్లీలో వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 26,606కి చేరుకుంది. మొత్తం కేసుల సంఖ్య 20,35,156కు చేరుకున్నట్లు కేజ్రీవాల్ ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం దేశ రాజధానిలోని 7,975 కోవిడ్ పడకల్లో 318 నిండిపోయనట్లు ప్రభుత్వం వెల్లడించింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

కరోనాతో దిల్లీలో కొత్తగా ఆరుగురు మృతి