
దేశంలో కొత్తగా 10,112మందికి కరోనా; మరణాలు 29
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలో ఒక్కరోజులోనే 10,112 కరోనా కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం తెలిపింది. దీంతో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 67,806కి పెరిగిందని కేంద్రం వెల్లడించింది.
తాజా కేసులతో కలిపి దేశంలో మొత్తం బాధితుల సంఖ్య 4.48 కోట్ల(4,48,91,989)కు చేరినట్లు పేర్కొంది.
కోవిడ్‌తో గత 24గంటల్లో 29మరణాలు సంభవించినట్లు కేంద్ర చెప్పింది. దీంతో మొత్తం మరణాల సంఖ్య 5,31,329కి చేరుకుంది. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 7.03 శాతం కాగా, వారంవారీ పాజిటివిటీ రేటు 5.43 శాతంగా నమోదైంది.
గత 24 గంటల్లో 9,833 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద ఇప్పటి వరకు 220.66 కోట్ల డోస్‌లను అందించినట్లు కేంద్రం చెప్పింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
కరోనా వివరాలను వెల్లడిస్తూ కేంద్ర ఆరోగ్యశాఖ ట్వీట్
#AmritMahotsav#Unite2FightCorona#LargestVaccineDrive
— Ministry of Health (@MoHFW_INDIA) April 23, 2023
𝗖𝗢𝗩𝗜𝗗 𝗙𝗟𝗔𝗦𝗛https://t.co/DOzgcEdRpx pic.twitter.com/ge34R6yzms