దేశంలో కొత్తగా 11,109మందికి కరోనా; 7నెలల గరిష్టానికి కేసులు
దేశంలో గత 24 గంటల్లో 11,109 కరోనా కొత్త కేసులు నమోదైనట్లు శుక్రవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. రోజువారీ సానుకూలత రేటు 5.01 శాతంగా నమోదైనట్లు వెల్లడించింది.ఏడు నెలల్లో ఇదే అత్యధికమని కేంద్రం పేర్కొంది. కొత్త కేసులతో కలిపి దేశంలో కోవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య 49,622కు చేరుకున్నట్లు వెల్లడించింది. అలాగే వారంవారీ పాజిటివిటీ రేటు 4.29 శాతంగా ఉంది. కరోనా నుంచి ఇప్పటి వరకు 4,42,16,583 మంది కోలుకున్నట్లు కేంద్రం తెలిపింది.
కరోతో దేశంలో కొత్తగా 29మంది మృతి
దేశంలో కరోనా కారణంగా కొత్తగా 29మంది చనిపోయినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం మరణాలు సంఖ్య 5,31,064కు చేరుకుంది. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద ఇప్పటివరకు మొత్తం 220,66,25,120 కోట్ల వ్యాక్సిన్ డోస్‌లు అందించినట్లు కేంద్రం చెప్పింది. ముంబయిలో ఒక్కరోజే 274 కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 11,59,819కు చేరుకున్నాయి. గత ఏడాది సెప్టెంబర్ తర్వాత 300మార్కును ఉల్లంఘించడం ఇదే మొదటిసారి. దిల్లీలో గరిష్టంగా ఒక్కరోజే 27.77 శాతం పాజిటివ్ రేటుతో 1,527 కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి.