Page Loader
 దేశంలో కొత్తగా 405మందికి కరోనా; నలుగురు మృతి
దేశంలో కొత్తగా 405మందికి కరోనా; నలుగురు మృతి

 దేశంలో కొత్తగా 405మందికి కరోనా; నలుగురు మృతి

వ్రాసిన వారు Stalin
May 23, 2023
12:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశంలో గత 24గంటల్లో 405 కరోనా కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. కొత్త కేసులతో కలిపి క్రియాశీల కేసులు 7,104కి తగ్గినట్లు కేంద్రం తెలిపింది. తాజాగా కరోనాతో నలుగురు మృతి చెందినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీంతో మొత్తం మృతుల సంఖ్య 5,31,843కి పెరిగింది. దేశంలో ప్రస్తుతం మొత్తం కోవిడ్ కేసులు 4.49 కోట్లు(4,49,87,339) ఉన్నట్లు కేంద్రం పేర్కొంది. మొత్తం ఇన్ఫెక్షన్‌లలో యాక్టివ్ కేసులు 0.02 శాతం ఉన్నాయి. జాతీయ కోవిడ్ -19 రికవరీ రేటు 98.80 శాతంగా నమోదైందని మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద ఇప్పటివరకు 220.66 కోట్ల డోస్‌లు అందించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

దేశంలో యాక్టివ్ కేసులు 7,104