తదుపరి వార్తా కథనం
Telangana: ముగిసిన స్థానిక ఎన్నికల పోలింగ్.. మండల వ్యాప్తంగా 83.45% ఓటింగ్ శాతం నమోదు
వ్రాసిన వారు
Sirish Praharaju
Dec 11, 2025
05:08 pm
ఈ వార్తాకథనం ఏంటి
హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం పరిధిలో స్థానిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరికొద్ది గంటల్లోఏ అభ్యర్థి విజయం సాధించబోతున్నాడో తేలనుంది. ఓటర్లు ఎక్కువ మొత్తంలలో ఓటింగ్ కేంద్రాలకు చేరుకొని సమయం లోపల కేంద్రంలో నిలబడి ఒంటి గంట తర్వాత కూడా ఓట్లు వేశారు. పోలింగ్ ముగిసినప్పుడు మండలంలో మొత్తం ఓటింగ్ శాతం 83.45%గా నమోదైంది. ఇందులో అత్యధిక ఓటింగ్ శాతం మర్రిపల్లి గ్రామంలో 91.86%గా ఉండగా,అత్యల్పంగా మేజర్ గ్రామపంచాయతీ,కమలాపూర్ మండల కేంద్రంలో 79.04%గా నమోదైంది. మండలంలోని 24గ్రామ పంచాయతీలలో ఒక పంచాయతీ ఏకగ్రీవంగా ఉంది. మిగిలిన 23 గ్రామ పంచాయతీల సర్పంచ్,వార్డు సభ్యుల ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. కౌంటింగ్ సెంటర్ వద్ద,అభ్యర్థులు, వారి అభిమానులు ఫలితాలను ఆసక్తిగా ఎదురుచూస్తూ భారీ సంఖ్యలో చేరారు.