Loading...
AP Parishad Elections: ఏపీలో పరిషత్‌ ఎన్నికల కౌంటింగ్‌ ప్రారంభం.. 21 వేల మంది అభ్యర్థుల భవితవ్యం నేడే తేలేది!
ఏపీలో పరిషత్‌ ఎన్నికల కౌంటింగ్‌ ప్రారంభం.. 21 వేల మంది అభ్యర్థుల భవితవ్యం నేడే తేలేది!

AP Parishad Elections: ఏపీలో పరిషత్‌ ఎన్నికల కౌంటింగ్‌ ప్రారంభం.. 21 వేల మంది అభ్యర్థుల భవితవ్యం నేడే తేలేది!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 07, 2026
08:24 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌లో పరిషత్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ శనివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. తొలుత పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లను లెక్కిస్తున్నారు. ఆ ప్రక్రియ పూర్తయిన అనంతరం పోలింగ్‌లో నమోదైన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా గురువారం 582 జడ్పీటీసీ, 7,767 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. వీటిలో 77 జడ్పీటీసీ, 2,051 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన స్థానాల్లో బరిలో నిలిచిన మొత్తం 21,012 మంది అభ్యర్థుల రాజకీయ భవితవ్యం ఓట్ల లెక్కింపుతో తేలనుంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 365 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఈ ప్రక్రియను నిర్వహించేందుకు 39,694 మంది సిబ్బందిని నియమించారు.

వివరాలు

రాత్రి 8గంటల లోపు పూర్తి చేయాలి

పరిషత్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపును శనివారం ఉదయం 8 గంటలకు ప్రారంభించి, రాత్రి 8 గంటల్లోపు పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం జిల్లా కలెక్టర్లను ఆదేశించింది.

మరోవైపు లెక్కింపు కేంద్రాల వద్ద పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు. మొత్తం 40,679 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు.

లెక్కింపు కేంద్రాల లోపల, వెలుపల సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి నిరంతరం నిఘా ఉంచారు.

ఈ కెమెరాల ఫుటేజ్‌ను ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయిన తర్వాత కూడా 60 రోజుల పాటు భద్రపరచాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది.

ADVERTISEMENT