Page Loader
Intimacy in Car: పబ్లిక్ ప్లేస్ లో శృంగారం.. ప్రశ్నించిన పోలీస్.. ఆపై ఏమైందంటే! 
Intimacy in Car: పబ్లిక్ ప్లేస్ లో శృంగారం.. ప్రశ్నించిన పోలీస్.. ఆపై ఏమైందంటే!

Intimacy in Car: పబ్లిక్ ప్లేస్ లో శృంగారం.. ప్రశ్నించిన పోలీస్.. ఆపై ఏమైందంటే! 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 25, 2024
04:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

బెంగళూరులో గురువారం ఓ జంట పబ్లిక్ ప్లేస్ లో రోడ్డుపై కారు ఆపి, ఆ కారులోనే పని కానిచ్చేశారు.పైగా, ఇదేంటని ప్రశ్నించిన పోలీసు అధికారిని కారుతో గుద్దేశారు. ఈ ఘటన బెంగళూరులోని జ్ఞానభారతి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకోగా గాయపడిన సబ్ ఇన్‌స్పెక్టర్ మహేష్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పారిపోయిన దంపతుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, జ్ఞానభారతి పోలీస్ స్టేషన్ పరిధిలో గల ఓ పార్క్ వద్ద పబ్లిక్ ప్లేస్ లో అందరూ చూస్తుండగానే ఓ జంట తమ వాహనంలో బట్టలు విప్పి శృంగార కార్యక్రమాలలో నిమగ్నమై ఉన్నారు.

Details 

కారుతో ఎస్ఐ ని గుద్దేసిన జంట 

ఆ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న సబ్‌ఇన్‌స్పెక్టర్‌ మహేష్‌ వారి వద్దకు వెళ్లి వార్నింగ్‌ ఇచ్చి వెళ్లిపోవాలని సూచించారు. వాహనం రిజిస్ట్రేషన్‌ నంబర్‌ను నమోదు చేస్తుండగా, ఆ దంపతులు అకస్మాత్తుగా వాహనాన్ని స్టార్ట్‌ చేసి ఎస్ఐని గుద్దేశారు. పోలీసు వాహనం ముందు నిలబడి ఉన్న ఎస్ఐ మహేష్ కారు బానెట్‌పై పడిపోయారు. అధికారిని పట్టించుకోకుండా ఆ జంట వాహనాన్ని రివర్స్‌ చేసి వెళ్లిపోయారు. కదులుతున్న వాహనంపై నుంచి కిందపడటంతో సబ్‌ఇన్‌స్పెక్టర్‌ కి గాయాలయ్యాయి. ప్రస్తుతం జ్ఞానభారతి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

పబ్లిక్ ప్లేస్ లో శృంగారం