National Herald case: నేషనల్ హెరాల్డ్ కేసు.. సోనియా,రాహుల్‌గాంధీకి ఊరట
ఈ వార్తాకథనం ఏంటి
నేషనల్ హెరాల్డ్ కేసులో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ వ్యవహారంలో కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు తాత్కాలిక ఊరట లభించింది. ఈ కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ఇప్పటికే చార్జ్‌షీట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే, ఆ చార్జ్‌షీట్‌ను పరిగణనలోకి తీసుకునేందుకు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ముందుకు రాలేదు.
వివరాలు
తదుపరి విచారణ కొనసాగించేందుకు ఈడీ అధికారులకు కోర్టు అనుమతి
అలాగే, నేషనల్ హెరాల్డ్ కేసులో తాజాగా నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఏర్పడే అంశాలను విచారించడానికి కూడా కోర్టు నిరాకరించింది. దర్యాప్తు ఏ ఎఫ్‌ఐఆర్‌ను ఆధారంగా చేసుకుని కొనసాగుతోందని ఈడీ అధికారులను కోర్టు ప్రశ్నించింది. కేవలం ఒక వ్యక్తి ఫిర్యాదు ఆధారంగానే దర్యాప్తు జరుగుతోందని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ దశలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు ఇతర నిందితులకు ఎఫ్‌ఐఆర్ ప్రతిని పొందే హక్కు లేదని స్పష్టం చేసింది. అయితే, ఈ కేసులో తదుపరి విచారణ కొనసాగించేందుకు ఈడీ అధికారులకు కోర్టు అనుమతి మంజూరు చేసింది.