Atishi: ఆప్ మంత్రి ఆతిషీకి ఢిల్లీ కోర్టు సమన్లు
ఆప్ శాసనసభ్యులతో బిజెపి బేరసారాలు చేసిందన్న ఆరోపణ ఆప్ మంత్రి ఆతిషీ కి ఇబ్బందిగా మారింది. దీనిపై స్పందించిన కోర్టు జూన్ 29న తమ ముందు హాజరు కావాలని ఆదేశించింది. తనతో పాటు తన పార్టీ పై ఆతిషీ నిరాధార ఆరోపణలు చేశారన్నారు. దీనిపై స్ధానిక కోర్టులో బిజెపి నేత పరువు నష్టం దావా వేశారు. ప్రస్తుతం బిజెపి మీడియా ఢిల్లీ ఇన్ ఛార్జ్ ప్రవీణ్ శంకర్ కపూర్ వున్నారు. తగిన ఆధారాలు లేకుండానే ఆమె ఈ ఆరోపణలు చేశారన్నారు. ఆయన ఏప్రియల్ 30న కోర్టు దృష్టికి తెచ్చారు. ఇదే రకమైన ఆరోపణలు ముఖ్యమంత్రి అవింద్ కేజ్రీవాల్ చేశారు.
ఈడి అరెస్ట్ చేసినా పార్టీ మారను
ఆయన మరో కేసులో ప్రస్తుతం బెయిల్ పై వున్నారు. దీంతో ఆయనకు సమన్లు జారీ చేయలేదు. ఒక్కో ఆప్ శాసనసభ్యుడికి బిజెపి పాతిక కోట్ల రూపాయల చొ ప్పున ఏడుగురికి ఇవ్వజూపారని కేజ్రీవాల్ ఆరోపించారు. సోషల్ మీడియాలో చేసిన పోస్టులను సాక్ష్యంగా బిజెపి నేత కోర్టుకు సమర్పించారు. వీటన్నింటినీ పరిశీలించిన మీదట కోర్టు ఆతిషీకి సమన్లు జారీ చేసింది. అయితే వీటికి తాను బెదిరి పారిపోనని మంత్రి స్పష్టం చేశారు. ఈడి అరెస్ట్ చేసినా పార్టీ మారబోనని తేల్చి చెప్పారు.