Covid-19 cases: మళ్లీ విజృంభిస్తోన్న కొవిడ్ మహమ్మారి..800కు చేరుతున్న కొత్త కేసులు..ఐదు మరణాలు
ఈ వార్తాకథనం ఏంటి
భారతదేశంలో కొవిడ్ మహమ్మారి మళ్లీ కొరలు చాస్తోంది. రోజూ వారీ కేసుల్లో భారీ పెరుగుదల కనిపిస్తోంది.
తాజాగా 798 కేసులు కొత్తగా నమోదయ్యాయి. దీంతో 800కు చేరువగా కేసులు రికార్డు అయ్యాయి.
గురువారం ఉదయం 8 గంటల నుంచి శుక్రవారం ఉదయం 8 గంటల వరకూ 24 గంటల వ్యవధిలో 798 కొత్త కేసులు బయటపడ్డాయి.
ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. తాజా కేసులతో కలిసి దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 4,091కి చేరుకుంది.
DETAILS
అత్యధికంగా కేరళలో 78 కేసులు
ఇక గురువారం ఒక్కరోజే ఐదు మరణాలు సంభవించాయి. కొవిడ్ మహమ్మారి కారణంగా కేరళలో ఇద్దరు, మహారాష్ట్ర, పుదుచ్చేరి, తమిళనాడులో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.
ఫలితంగా మొత్తం కరోనా మరణాల సంఖ్య 5,33,351కి ఎగబాకింది.ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ వ్యాప్తికి కొత్త వేరియంట్ జేఎన్.1 కారణమని వైద్య వర్గాలు పేర్కొంటున్నాయి.
జేఎన్.1 కేసులెన్నంటే :
దేశంలో కొత్త వేరియంట్ జేఎన్1 కేసులు భారీగా పెరుగుతున్నాయి.ఇప్పటి వరకు 157 జేఎన్.1 కేసులు బయటపడ్డాయని ఇండియన్ సార్స్ కోవ్-2 జెనోమిక్స్ కన్సార్టియం (INSACOG) వెల్లడించింది.ఇందులో అత్యధికంగా కేరళలో 78 కేసులు వెలుగుచూశాయి.
గుజరాత్‌లో 34,
గోవాలో 18,
కర్ణాటకలో 8,
మహారాష్ట్రలో 7,
రాజస్థాన్‌లో 5,
తమిళనాడులో 4,
తెలంగాణలో 2,
దిల్లీలో ఒక కేసు గుర్తించింది.