LOADING...
Vice President: భారత 17వ ఉపరాష్ట్రపతిగా  సీపీ రాధాకృష్ణన్‌ 
భారత 17వ ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్‌

Vice President: భారత 17వ ఉపరాష్ట్రపతిగా  సీపీ రాధాకృష్ణన్‌ 

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 09, 2025
07:29 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ విజయం సాధించారు. ఈఎన్నికలో మొత్తం 781మంది సభ్యులకు ఓటు హక్కు ఉండగా,అందులో 768మంది పార్లమెంట్ సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే భారత రాష్ట్ర సమితి,బీజేడీ,శిరోమణి అకాళీ దళ్ వంటి పార్టీల సభ్యులు ఓటు వేయలేదు. ఉప రాష్ట్రపతి పదవికి ఎన్డీయే తరఫున సీపీ రాధాకృష్ణన్ అభ్యర్థిగా వ్యవహరించగా,విపక్షాల సంయుక్త అభ్యర్థిగా జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి పోటీ చేశారు. పార్లమెంట్ నూతన భవనంలోని 'ఎఫ్-101 వసుధ' గదిలో ఉదయం 10గంటల నుంచి ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమై సాయంత్రం 5గంటల వరకు సాగింది. ఓట్లు వేయడం పూర్తైన వెంటనే సాయంత్రం 6 గంటల నుండి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నూతన ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన రాధాకృష్ణన్

వివరాలు 

ప్రహ్లాద్ జోషి నివాసంలో  వేడుకలు 

ఈ ఎన్నికల్లో 98 శాతం ఎంపీలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్డీయేకు చెందిన మొత్తం 427 మంది ఎంపీలు ఓటు వియోగంలో పాల్గొన్నారు. ఈ విజయం కారణంగా బీజేపీ నాయకత్వంలో ఉత్సాహం, ఆనంద వాతావరణం నెలకొంది. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి నివాసంలో ఎన్డీఏ ఎంపీల కోసం ప్రత్యేకంగా వేడుకలు నిర్వహించబడినట్లు సమాచారం. ఫలితాలు ప్రకటించిన తర్వాత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రహ్లాద్ జోషి నివాసాన్ని సందర్శించేందుకు ప్లాన్ చేశారు అని పార్టీ వర్గాలు వెల్లడించాయి.