Loading...
CJP Protests: పాడ్‌కాస్ట్ వ్యాఖ్యలతో దుమారం.. భరద్వాజ్ అరెస్టుకు సీజేపీ ఆందోళన
పాడ్‌కాస్ట్ వ్యాఖ్యలతో దుమారం.. భరద్వాజ్ అరెస్టుకు సీజేపీ ఆందోళన

CJP Protests: పాడ్‌కాస్ట్ వ్యాఖ్యలతో దుమారం.. భరద్వాజ్ అరెస్టుకు సీజేపీ ఆందోళన

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 04, 2026
02:19 pm

ఈ వార్తాకథనం ఏంటి

సీజేపీ నాయకులు మరోసారి ఆందోళన బాట పట్టారు. జంతర్‌మంతర్‌ వద్ద జరిగిన నిరసనల సమయంలో దళిత విద్యార్థిని నిశూ ఆజాద్‌ తండ్రి సంజయ్‌ కుమార్‌పై దాడి చేసినట్లు పాడ్‌కాస్ట్‌లో స్వయంగా చెప్పుకున్న ఇన్‌ఫ్లుయెన్సర్‌ స్వతంత్ర భరద్వాజ్‌ను అరెస్టు చేయాలని డిమాండ్‌ చేస్తూ సీజేపీ నేతలు సౌరవ్‌ దాస్‌, అశుతోష్‌ రంకా తదితరులు పార్లమెంట్‌ స్ట్రీట్‌ పోలీస్‌ స్టేషన్‌ ఎదుట నిరసన చేపట్టారు. ఆజాద్‌ సమాజ్‌ పార్టీ (కాన్షీరామ్‌) అధినేత, ఎంపీ చంద్రశేఖర్‌ ఆజాద్‌ తదితరులు వారికి మద్దతుగా ఆందోళనలో పాల్గొన్నారు. భరద్వాజ్‌పై చర్యలు తీసుకోవడంలో ఢిల్లీ పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని సీజేపీ నాయకులు ఆరోపించారు.

వివరాలు 

ఒక్క పాడ్‌కాస్ట్ వీడియోతో మొదలైన వివాదం

బాధితుడు దళిత కుటుంబానికి చెందిన వ్యక్తి కావడంతో స్వతంత్ర భరద్వాజ్‌పై ఎస్సీ/ఎస్టీ చట్టం కింద కేసుతో పాటు హత్యాయత్నం కేసు కూడా నమోదు చేయాలని వారు డిమాండ్‌ చేశారు.

జంతర్‌మంతర్‌ వద్ద జూన్‌ 23న సీజేపీ ఆధ్వర్యంలో జరిగిన ఆందోళన గురించి స్వతంత్ర భరద్వాజ్‌ ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడారు.

ఆ సమయంలో సంజయ్‌ కుమార్‌ తలపై తానే దాడి చేశానని ఆయన చెప్పడం తీవ్ర కలకలం రేపింది.

తన దాడి కారణంగా సంజయ్‌ కుమార్‌కు 60 కుట్లు పడ్డాయని కూడా భరద్వాజ్‌ చెప్పినట్లు వీడియోలో వెల్లడైంది.

తాను చేసిన చర్యకు హత్యాయత్నం కేసు నమోదు చేయాల్సి ఉందని భరద్వాజ్‌ వ్యాఖ్యానించారు.

వివరాలు 

ఒక్క పాడ్‌కాస్ట్ వీడియోతో మొదలైన వివాదం

తన దాడి తర్వాత బాధితుడు అంబులెన్స్‌లో దాదాపు ప్రాణాపాయ స్థితిలో వెళ్లాడని, అయినప్పటికీ తనను కనీసం జైలుకు కూడా పంపలేదని పేర్కొన్నారు. రాత్రంతా తాను బయటే తిరిగానని చెప్పుకొచ్చారు.

ఢిల్లీ పోలీసుల మాదిరిగానే తాను కూడా అక్కడే తిరిగానని, తన వెనుక బీజేపీకి చెందిన పలువురు కీలక నాయకుల మద్దతు ఉందని ఆయన చేసిన వ్యాఖ్యలు మరింత సంచలనంగా మారాయి.

ఈ పాడ్‌కాస్ట్ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో సీజేపీతో పాటు ప్రతిపక్ష పార్టీల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి.

రాహుల్‌ గాంధీ సైతం ఈ అంశంపై స్పందించారు. బీజేపీ నేతల రక్షణ ఉందనే ధైర్యంతోనే నిందితుడు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు.

ADVERTISEMENT

వివరాలు 

మాట మార్చిన భరద్వాజ్‌.. ఆత్మరక్షణ కోసమేనంటూ వివరణ

ఇప్పటికైనా ఢిల్లీ పోలీసులు చర్యలు తీసుకుంటారా? లేక అతడిని కాపాడుతూనే ఉంటారా? అంటూ ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, ఢిల్లీ పోలీసులను ప్రశ్నించారు.

పాడ్‌కాస్ట్‌లో చేసిన వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో రాజకీయ ప్రకంపనలు సృష్టించడంతో స్వతంత్ర భరద్వాజ్‌ తాజాగా తన వైఖరిని మార్చారు.

తాను చేసిన దాడి ఆత్మరక్షణలో భాగమేనని పేర్కొన్నారు. తాజాగా మాట్లాడుతూ.. తనను 10 నుంచి 15 మంది వ్యక్తులు చుట్టుముట్టారని ఆయన ఆరోపించారు.

ఆ సమయంలో తాను ఎదురు దాడి చేయకపోతే ఆ గుంపు తనను తీవ్రంగా కొట్టి చంపేసేదని లేదా హత్య చేసేదని చెప్పారు.

అందుకే ఆత్మరక్షణ కోసం దాడి చేయాల్సి వచ్చిందని వివరించారు.

ADVERTISEMENT

వివరాలు 

బీజేపీకి ఇది రాజకీయంగా ఇబ్బందికరంగా మారుతుందా?

అయితే గతంలో ఇదే ఘటనపై తానే దాడి చేశానని గర్వంగా చెప్పుకున్న వ్యక్తి.. విమర్శలు పెరగడంతో ఇప్పుడు ఆత్మరక్షణ కోసమే అలా చేశానని చెప్పడం చర్చనీయాంశంగా మారింది.

ఇదిలా ఉండగా.. జంతర్‌మంతర్‌ వద్ద జరిగిన ఆందోళనల్లో విద్యార్థులపై బయటి వ్యక్తులు దాడి చేశారని సీజేపీ మొదటి నుంచీ ఆరోపిస్తోంది.

ఈ నేపథ్యంలో భరద్వాజ్‌ పాడ్‌కాస్ట్‌ వ్యాఖ్యలు వెలుగులోకి రావడం ఆ పార్టీ ఆందోళనలకు మరింత రాజకీయ ప్రాధాన్యం తీసుకొచ్చింది.

ఈ వ్యవహారం సీజేపీ నిరసనల పరంపరను మరింత ఉద్ధృతం చేస్తుందా? కేంద్రంలోని బీజేపీకి ఇది రాజకీయంగా ఇబ్బందికరంగా మారుతుందా? అనే చర్చ ప్రస్తుతం కొనసాగుతోంది.

ADVERTISEMENT