 
                                                                                Samineni Rama Rao: ఖమ్మంలో ఘోరం.. సీపీఐ నాయకుడిని దారుణ హత్య
ఈ వార్తాకథనం ఏంటి
ఖమ్మం జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. సీపీఎం రైతు సంఘం నాయకుడు సామినేని రామారావును గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హతమార్చారు. చింతకాని మండలం పాతర్లపాడు గ్రామంలో శుక్రవారం ఉదయం జరిగిన ఈ హత్య స్థానికంగా తీవ్ర ఆందోళనకు గురి చేసింది. వివరాల్లోకి వెళ్తే.. సామినేని రామారావు ప్రతిరోజూ మాదిరిగా ఈరోజు ఉదయం కూడా నడకకు వెళ్లారు. ఆ సమయంలో మార్గమధ్యంలో దుండగులు ఆయనను అడ్డగించి, పదునైన ఆయుధంతో గొంతు కోసి అక్కడికక్కడే చంపేశారు. అనంతరం రక్తపు మడుగులో ఆయన పడిఉండటాన్ని గమనించిన గ్రామస్తులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
వివరాలు
ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు
సమాచారం అందుకున్న పోలీసులు వేగంగా ఘటనాస్థలానికి చేరుకుని, పరిసరాలను పరిశీలించారు. ఆధారాలు సేకరిస్తూ, హత్య వెనుక ఉన్న ఉద్దేశాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ దారుణానికి రాజకీయ ప్రతీకారం లేదా వ్యక్తిగత విభేదాలు కారణమేమో అన్న కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనతో పాతర్లపాడు గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడవలసి ఉంది.