LOADING...
Cyber security: డిగ్రీ కోర్సుల్లో 'సైబర్‌ భద్రత'.. యూజీసీ తాజా మార్గదర్శకాలు
డిగ్రీ కోర్సుల్లో 'సైబర్‌ భద్రత'.. యూజీసీ తాజా మార్గదర్శకాలు

Cyber security: డిగ్రీ కోర్సుల్లో 'సైబర్‌ భద్రత'.. యూజీసీ తాజా మార్గదర్శకాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 24, 2025
09:45 am

ఈ వార్తాకథనం ఏంటి

సైబర్‌ భద్రతపై విద్యార్థుల అవగాహనను పెంపొందించేందుకు ఇక సాధారణ డిగ్రీ స్థాయిలోనే విద్యార్థులకు దీన్ని బోధించనున్నారు. ఈ దిశలో రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు ప్రస్తుత విద్యాసంవత్సరం నుండి బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సులలో సైబర్‌ భద్రతను బోధనాంశంగా ప్రవేశపెడుతున్నాయి. డిగ్రీ కోర్సుల సాంకేతిక పాఠ్యాంశాల పరిధిలో 20% సైబర్‌ భద్రత పాఠాలను బోధించి, సెమిస్టర్‌ పరీక్షల్లో కూడా చేర్చాలి అని యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. డిగ్రీ ప్రథమ సంవత్సరం నుండే విద్యార్థులు సైబర్‌ భద్రతపై మౌలిక విద్య పొందేలా, పాఠ్యాంశాలకు 20 క్రెడిట్‌ పాయింట్లు కూడా కేటాయించనున్నారు. దీని ద్వారా సైబర్‌ నేరాలను నివారించగల నిపుణుల కొరతను తీర్చడం లక్ష్యంగా పెట్టుకున్నారు.

వివరాలు 

సైబర్‌ భద్రత అత్యంత అవసరమైన అంశం

గతేడాది తో పోలిస్తే, ఈ ఏడాది మొదటి 9 నెలల్లో సైబర్‌ నేరాలు 200% పెరిగాయి. నేరగాళ్లు ప్రతి సంవత్సరం కోట్లు రూపాయల నష్టం కలిగిస్తున్నారు. డిజిటల్‌ అరెస్టులు, మాదకద్రవ్యాల కొరియర్‌లు, అసభ్య వీడియోలు వంటి అనేక మార్గాల్లో ప్రజలను బెదిరిస్తూ, నష్టపరిచే ఘటనలు జరుగుతున్నాయి. ఇక ఐటీ రంగ సంస్థలు, పరిశ్రమలు, మార్కెట్‌ అవసరాల కారణంగా సైబర్‌ భద్రత అత్యంత అవసరమైన అంశంగా మారింది. డెస్క్‌టాప్‌లు, ల్యాప్‌టాప్‌లలో ఇ-మెయిల్‌ ద్వారా మాల్‌వేర్‌ను ప్రవేశపెట్టి పరిశ్రమలు, కార్పొరేట్‌, ఆసుపత్రులు, ప్రభుత్వ రంగ సంస్థలను నేరగాళ్లు బెదిరిస్తున్నారు, సర్వర్లలోకి దొంగతనం చేసి కోట్ల రూపాయల నష్టం కలిగిస్తున్నారు.

వివరాలు 

దేశానికి సుమారు 50 లక్షల సైబర్‌ నిపుణుల అవసరం 

ఐటీ రంగంలో మార్పులను అధ్యయనం చేస్తున్న ఓ సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం, దేశానికి సుమారు 50 లక్షల సైబర్‌ నిపుణులు అవసరమని ఉన్నా, ప్రస్తుతం మాత్రం 3-4 లక్షల మంది మాత్రమే అందుబాటులో ఉన్నారని తేలింది. "వీటిని దృష్టిలో ఉంచుకొని,బీఏ,బీకాం,బీఎస్సీ విద్యార్థుల కోసం సైబర్‌ భద్రతపై మెరుగైన అవగాహన కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.ప్రొటోకాల్‌ పేరుతో కొన్ని ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ఇప్పటికే కొన్ని పాఠ్యాంశాలు బోధించబడుతున్నాయి.ఈ పాఠ్యాంశాలలో ప్రాథమిక అంశాలు,సైబర్‌ నేరాలను ఎలా నివారించాలో అనే అంశాలపై అధ్యాపకులు విద్యార్థులను శిక్షణ ఇస్తున్నారు. ప్రైవేటు పాఠశాలల్లో సైబర్‌ భద్రత బోధిస్తున్నప్పటికీ, డిగ్రీ స్థాయిలో మరింత సమగ్రమైన శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉంది"ప్రొఫెసర్‌ వి. బాలకిష్టారెడ్డి, ఉన్నత విద్యామండలి ఛైర్మన్