Page Loader
Hemant Soren: సోరెన్ పార్టీకి సైబర్ షాక్‌.. జేఎంఎం 'ఎక్స్' ఖాతా హ్యాక్‌!
సోరెన్ పార్టీకి సైబర్ షాక్‌.. జేఎంఎం 'ఎక్స్' ఖాతా హ్యాక్‌!

Hemant Soren: సోరెన్ పార్టీకి సైబర్ షాక్‌.. జేఎంఎం 'ఎక్స్' ఖాతా హ్యాక్‌!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 13, 2025
12:19 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఝార్ఖండ్ ముక్తీ మోర్చా (జేఎంఎం) అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతా హ్యాక్‌కు గురైంది. ఈ విషయాన్ని స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ధృవీకరించారు. ఆదివారం ఈ ఘటనపై స్పందించిన ఆయన, ఎక్స్‌లో ఓ అధికారిక పోస్టు ద్వారా సమాచారం ఇచ్చారు. సోరెన్ తెలిపిన వివరాల ప్రకారం, పార్టీ ఖాతాను క్రిప్టోకరెన్సీ హ్యాకర్లు టార్గెట్ చేశారు. హ్యాకైన ఖాతాలో క్రిప్టో పేమెంట్ అడ్రస్‌ పోస్టు చేయడం, ఉడత ఉన్న చిత్రాన్ని అప్‌లోడ్‌ చేయడం వంటి అసాధారణ కార్యకలాపాలు కనిపించాయి. దీనిపై తీవ్రంగా స్పందించిన సీఎం సోరెన్, 'జేఎంఎం పార్టీ ఖాతాను అసాంఘిక శక్తులు హ్యాక్ చేశాయి. పోలీసు శాఖ తక్షణం చర్యలు తీసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేశారు.

Details

ఢిల్లీలో హేమంత్ సోరెన్

ఈ ఘటన చోటుచేసుకున్న సమయంలో హేమంత్ సోరెన్ ఢిల్లీలో ఉన్నారు. ఆయన తండ్రి, జేఎంఎం పితామహుడు శిబు సోరెన్ ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. సీఎం ఆదేశాలపై స్పందించిన రాష్ట్ర పోలీసులు, ఈ హ్యాకింగ్‌ ఘటనపై సమాచారం తమ దృష్టికి వచ్చిందని, దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. సమాజ మాధ్యమాల్లో ప్రాచుర్యం పొందిన ఖాతాలు లక్ష్యంగా మారుతున్న ఘటనలు రోజు రోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో, ఇది మరొక ఉదాహరణగా నిలిచింది. పార్టీ ఖాతాను తిరిగి సాధించేందుకు సాంకేతిక నిపుణుల సహకారంతో చర్యలు తీసుకుంటున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.