AP: తస్మాత్ జాగ్రత్త.. సంక్షేమ పథకాల పేరుతో లబ్ధిదారులను మోసం చేస్తున్న సైబర్ ముఠా
ఆంధ్రప్రదేశ్‌లో సైబర్ నేరగాళ్లు మోసాలకు కొత్త దారుల్లో వెళ్తున్నారు. అందివచ్చిన ఏ అవకాశాన్నా కూడా వదలకుండా ప్రజలను బోల్తా కొట్టిస్తున్నారు. తాజాగా ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల పేరుతో లబ్ధిదారులను మోసం చేస్తున్నారు. ఇటీవల విశాఖపట్నంలో వెలుగు చూసిన ఓ సైబర్ నేరమే ఇందుకు ఉదాహరణ. ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్ ప్రభుత్వం అమ్మ ఒడి, చేయూత, జగన్నన విద్యదీవెన వంటి అనేక పథకాలను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. దిల్లీ కేంద్రంగా పని చేస్తున్న సైబర్ ముఠా.. లబ్ధిదారులకు ఫొన్ చేసిన బురిడీ కొటిస్తున్నారు.
ఒక లింక్ పంపి..
సైబర్ నేరగాళ్లు.. ఏపీలోని లబ్ధిదారులకు ఫొన్ చేసి జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల డబ్బులు అందుతున్నాయా అని అడుగుతారు. ఏదైనా పథకం డబ్బులు రాకపోతే.. వెంటనే డబ్బులు ఖాతాలో వేస్తామమని చెబుతారు. ఈ క్రమంలో ఒక లింక్ పంపిస్తామని, దానిపై క్లిక్ చేసి, వివరాలను నమోదు చేయాలని వివరిస్తారు. దీంతో డబ్బులు రాని లబ్ధిదారులు.. బ్యాంకు ఖాతాలతో పాటు అన్ని వివరాలను నమోదు చేయగా.. క్షణాల్లోనే వారి ఖాతా ఖాళీ అవుతోంది. ఇలాగే, విశాఖలోని ఒక వ్యక్తి దగ్గర 'అమ్మ ఒడి' పేరుతో రూ.లక్ష కాజేశారు.