Loading...
Cyclone Akvan: ఏపీ,ఒడిశా తీరాల వైపు అక్వాన్‌ తుఫాను.. గంటకు 110 కి.మీ. వేగంతో ఈదురుగాలులు
ఏపీ,ఒడిశా తీరాల వైపు అక్వాన్‌ తుఫాను.. గంటకు 110 కి.మీ. వేగంతో ఈదురుగాలులు

Cyclone Akvan: ఏపీ,ఒడిశా తీరాల వైపు అక్వాన్‌ తుఫాను.. గంటకు 110 కి.మీ. వేగంతో ఈదురుగాలులు

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 19, 2026
03:31 pm

ఈ వార్తాకథనం ఏంటి

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుఫాను అక్వాన్‌ తీర ప్రాంతాల వైపు వేగంగా కదులుతోంది. గత ఆరు గంటలుగా గంటకు 5 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నట్లు భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. ప్రస్తుతం ఈ తుఫాను పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉంది. ఆంధ్రప్రదేశ్‌లోని నర్సాపూర్‌కు ఆగ్నేయంగా 480 కిలోమీటర్లు, కళింగపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా 510 కిలోమీటర్లు, చెన్నైకి తూర్పున 560 కిలోమీటర్లు, ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు దక్షిణంగా 600 కిలోమీటర్లు, పూరీకి దక్షిణంగా 660 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.

వివరాలు 

శుక్రవారం మధ్యాహ్నం తీరాన్ని దాటే అవకాశం

అక్వాన్‌ తుఫాను ప్రస్తుతం ఉత్తర వాయవ్య దిశగా కదులుతోంది.

నవంబర్ 20వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం నర్సాపూర్‌-పూరీ మధ్య ఉత్తర ఆంధ్రప్రదేశ్‌-యానాం, దక్షిణ ఒడిశా తీరాల మధ్య తీరం దాటే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది.

తుఫాను తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశముంది.

కొన్ని ప్రాంతాల్లో గరిష్ఠంగా గంటకు 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.

వివరాలు 

50 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలింపు

తీవ్ర తుఫాను అక్వాన్‌ ముప్పు నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం అప్రమత్తమైంది.

ప్రమాదం పొంచి ఉన్న ప్రాంతాల్లోని సుమారు 50 వేల మందిని ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించింది.

తుఫాను ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై బుధవారం ఒడిశా ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.

తుఫాను తీరం దాటే సమయంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

ఒక్క ప్రాణం కూడా కోల్పోకుండా చూడటమే తమ ప్రధాన లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు.

ADVERTISEMENT