Loading...
Cyclone Arnab: నరసాపురం వద్ద తీరం దాటిన 'అర్నబ్'తుపాను.. ఉభయ గోదావరి జిల్లాలకు వర్ష సూచన
ఉభయ గోదావరి జిల్లాలకు వర్ష సూచన

Cyclone Arnab: నరసాపురం వద్ద తీరం దాటిన 'అర్నబ్'తుపాను.. ఉభయ గోదావరి జిల్లాలకు వర్ష సూచన

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 28, 2026
12:24 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌ను గత కొన్ని రోజులుగా ఆందోళనకు గురిచేసిన 'అర్నబ్' అతి తీవ్ర తుపాను ఎట్టకేలకు తీరం దాటింది. యానాంకు నైరుతి దిశలో,పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం సమీపంలో తుపాను తీరాన్ని దాటినట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అధికారికంగా వెల్లడించింది. తుపాను తీరం దాటే ప్రక్రియ పూర్తయిందని అధికారులు స్పష్టం చేశారు. అనంతరం దాని తీవ్రత తగ్గడంతో అతి తీవ్ర తుపాను నుంచి తీవ్ర తుపానుగా మారినట్లు తెలిపారు. తుపాను ప్రభావంతో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ జిల్లాల్లో పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడవచ్చని అంచనా వేసింది.

వివరాలు 

తీరప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలి 

ముఖ్యంగా నేడు మధ్యాహ్నం వరకు వర్షాల తీవ్రత కొనసాగవచ్చని అధికారులు సూచించారు.

దీంతో తీరప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

మరోవైపు, తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

ప్రభుత్వ ఆదేశాల మేరకు జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్డీఆర్‌ఎఫ్), రాష్ట్ర విపత్తు స్పందన దళం (ఎస్డీఆర్‌ఎఫ్) బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపడుతున్నాయి.

వర్షాల నేపథ్యంలో ప్రజలు అధికారుల సూచనలు పాటించాలని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ADVERTISEMENT