Cyclone Arnab: అర్నబ్ తుపాను ప్రభావం.. కోతకు గురైన ఉప్పాడ తీరం
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ పై అర్నబ్ తుపాను (Cyclone Arnab) ప్రభావం కనిపిస్తోంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండగా, సముద్రంలో అలలు ఉద్ధృతంగా ఎగిసిపడుతున్నాయి. కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం ఉప్పాడ తీరంలో అలల ధాటికి సముద్రపు కోత తీవ్రంగా ఏర్పడింది. ఇటీవల ఎత్తుగా నిర్మించిన రాళ్లగట్టును సైతం అలలు దాటుకుని తీరంపైకి దూసుకొస్తున్నాయి. దీంతో బీచ్ రోడ్డుపైకి రాళ్లు కొట్టుకొచ్చాయి. ఫలితంగా ఆ మార్గంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది.
వివరాలు
ఉత్తరాంధ్రలోని పలు ప్రాంతాల్లో వర్షాలు
మరోవైపు ఉత్తరాంధ్రలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి.
శ్రీకాకుళం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతోంది.
కవిటి, కంచిలి, సోంపేట, పలాస, టెక్కలి, పాతపట్నం, నరసన్నపేట, శ్రీకాకుళం, గార, లావేరు, ఆమదాలవలస ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి.
విశాఖపట్నం జిల్లా భీమిలి తీరంలోనూ సముద్రపు అలలు తీవ్రంగా ఎగిసిపడుతున్నాయి.