Loading...
Telangana: అర్నబ్‌ తుపాను ప్రభావం.. నేడు తెలంగాణలో నాలుగు ఉమ్మడి జిల్లాల్లో వర్షాలు!
అర్నబ్‌ తుపాను ప్రభావం.. నేడు తెలంగాణలో నాలుగు ఉమ్మడి జిల్లాల్లో వర్షాలు!

Telangana: అర్నబ్‌ తుపాను ప్రభావం.. నేడు తెలంగాణలో నాలుగు ఉమ్మడి జిల్లాల్లో వర్షాలు!

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 27, 2026
08:29 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలో రానున్న మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అర్నబ్‌ తుపాను ప్రభావం మంగళవారం నుంచి రాష్ట్రంపై కనిపించే అవకాశం ఉందని తెలిపింది. మంగళవారం ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు,ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. బుధవారం రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌ జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని తెలిపింది.

వివరాలు 

ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలు

జయశంకర్‌ భూపాలపల్లి, సూర్యాపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. వరంగల్‌, హనుమకొండ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు పడవచ్చని వెల్లడించింది.

గురువారం ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు.

ఆదిలాబాద్‌, కుమురంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో అక్కడక్కడ ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు.

మరోవైపు, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఈ నెల 28వ తేదీ ఉదయం ఆంధ్రప్రదేశ్‌-యానాం ప్రాంతాల వద్ద తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.

తీరం దాటిన తర్వాత ఈ వ్యవస్థ ఉత్తర దిశగా ప్రయాణించే అవకాశం ఉందని చెబుతున్నారు.

ADVERTISEMENT