NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Cyclone Dana : హిందూ మహాసముద్రంలో ఏర్పడిన 'దానా' తుపాను.. ఒడిశాను తాకే అవకాశాలు
    తదుపరి వార్తా కథనం
    Cyclone Dana : హిందూ మహాసముద్రంలో ఏర్పడిన 'దానా' తుపాను.. ఒడిశాను తాకే అవకాశాలు
    హిందూ మహాసముద్రంలో ఏర్పడిన 'దానా' తుపాను.. ఒడిశాను తాకే అవకాశాలు

    Cyclone Dana : హిందూ మహాసముద్రంలో ఏర్పడిన 'దానా' తుపాను.. ఒడిశాను తాకే అవకాశాలు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Oct 21, 2024
    11:48 am

    ఈ వార్తాకథనం ఏంటి

    హిందూ మహాసముద్రంలో ఏర్పడిన 'దానా' తుపాను ఒడిశా రాష్ట్రాన్ని తాకడం ఖాయమని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) స్పష్టం చేసింది.

    ఈ తుపాను కారణంగా రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు పడతాయని ఐఎండీ తెలిపింది. అయితే తుపాన్‌కు 'దానా' అని ఎలా పేరు వచ్చిందో, ఆ తుఫాన్లకు పేర్లు ఎలా పెడతారో ఇప్పుడు తెలుసుకుందాం.

    ప్రపంచవ్యాప్తంగా ట్రాపికల్ సైక్లోన్స్​కు పేర్ల జాబితాను నిర్వహించడం అనేది ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంఓ) బాధ్యత.

    ప్రతి సారి కొత్త తుపాను ఏర్పడినప్పుడు, ముందుగానే నిర్ణయించిన పేర్ల జాబితా ఉపయోగిస్తారు. ఇది అక్షర క్రమంలో కేటాయిస్తారు. ఈ పేర్లు ప్రతి ఆరేళ్లకొక్కసారి మళ్లీ పునరావృతమవుతాయి.

    Details

    ఐఎండీ హెచ్చరిక

    ఉత్తర హిందూ మహాసముద్రంలో ఉష్ణమండల తుపాను నామకరణ వ్యవస్థలో పాల్గొన్న 14 దేశాలలో ఒకటైన సౌదీ అరేబియా ఈ 'దానా' పేరును ఇచ్చింది.

    దానా అనే పేరు అరబిక్ భాషలో 'ఉదారత' లేదా 'బహుమానం' అని అర్థం. ఈ ప్రాంతంలో ఇటీవలి తుపానులకు వివిధ దేశాల నుంచి వచ్చిన పేర్లను పరిశీలించండి

    తౌక్టే (మయన్మార్ పేరు, గెక్కో అని అర్థం)

    నివర్ (ఇరాన్ పేరు, కాంతి లేదా గాలి అని అర్థం)

    అంఫన్ (థాయ్​లాండ్ పేరు, ఆకాశం అని అర్థం)

    మధ్య అండమాన్ సముద్రంపై అక్టోబర్ 23 (బుధవారం) నాటికి ఈ వాయుగుండం 'దానా' తుపానుగా మారతుందని ఐఎండీ తెలిపింది.

    Details

    మత్స్యకారులు వేటకు వెళ్లొద్దు

    అక్టోబర్ 24 ఉదయం నాటికి ఇది ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీరాలకు చేరుకోనుంది.

    అక్టోబర్ 23 నుండి ఈ ప్రాంతంలో గంటకు 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, అక్టోబర్ 24 రాత్రి నుండి అక్టోబర్ 25 ఉదయం వరకు గంటకు 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించారు.

    అక్టోబర్ 24 నుంచి 25 వరకు ఉత్తర బంగాళాఖాతంలోకి మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఒడిశా
    తుపాను

    తాజా

    PBKS vs DC : పంజాబ్ కింగ్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం ఢిల్లీ క్యాపిటల్స్
    Pawan Kalyan: గతంలోని చేదు అనుభవాలు మరచిపోతే ఎలా..? సినీ పరిశ్రమపై పవన్ కళ్యాణ్ అసహనం! పవన్ కళ్యాణ్
    #NewsBytesExplainer: కరోనా రీ ఎంట్రీ.. కొత్త వేరియంట్‌తో మళ్లీ ఊహించని పరిస్థితులు వస్తాయా?  కోవిడ్
    Lion Attack: సింహాన్ని తాకాడు.. వెంటనే ఆస్పత్రికి పరుగులు తీశాడు (వీడియో) సోషల్ మీడియా

    ఒడిశా

    Dress code: పూరీ జగన్నాథ ఆలయంలో భక్తులకు డ్రెస్ కోడ్.. జీన్స్, స్కర్టులు ధరిస్తే నో ఎంట్రీ  పూరీ జగన్నాథ దేవాలయం
    ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కార్యదర్శి పదవీ విరమణ నవీన్ పట్నాయక్
    నవీన్ పట్నాయక్ సహాయకుడు వీకే పాండియన్ కి ఒడిశా కేబినెట్ మంత్రి హోదా  భారతదేశం
    Happy Diwali 2023: దీపావళిని ఏ రాష్ట్రంలో ఎలా జరుపుకుంటారో తెలుసుకుందాం  దీపావళి

    తుపాను

    దూసుకొస్తున్న బిపోర్‌జాయ్ తుపాను; గుజరాత్ తీర ప్రాంతాల్లో హై అలర్ట్ గుజరాత్
    బిపోర్‌జాయ్ తుపాను బీభత్సం; ముంబై ఎయిర్‌పోర్టులో విమానాల రాకపోకలపై ఎఫెక్ట్  ముంబై
    బిపోర్‌జాయ్‌ తుపానుపై ప్రధాని హై లెవల్ మీటింగ్.. అప్రమత్తంగా ఉండాలని ఆదేశం ప్రధాన మంత్రి
    తీవ్రంగా మారుతున్న బిపోర్‌జాయ్ తుపాను; అరేబియాలో ఎగిసిపడుతున్న రాకాసి అలలు  గుజరాత్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025