LOADING...
Cyclone Ditwah: 'దిత్వా' దెబ్బకు వణికిన నెల్లూరు జిల్లా.. వెంకటాచలంలో అత్యధిక వర్షపాతం నమోదు!
'దిత్వా' దెబ్బకు వణికిన నెల్లూరు జిల్లా.. వెంకటాచలంలో అత్యధిక వర్షపాతం నమోదు!

Cyclone Ditwah: 'దిత్వా' దెబ్బకు వణికిన నెల్లూరు జిల్లా.. వెంకటాచలంలో అత్యధిక వర్షపాతం నమోదు!

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 04, 2025
09:08 am

ఈ వార్తాకథనం ఏంటి

ఏపీపై తుఫాన్‌ల భయం వెంటాడుతూనే ఉంది. ఇటీవల 'మొంథా తుపాన్‌' మిగిల్చిన నష్టాలకు ఇప్పటికీ పూర్తిస్థాయిలో పరిహారం అందకముందే.. మళ్లీ 'దిత్వా' తుఫాన్‌ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసింది. వాయుగుండంగా నుంచి అల్పపీడనంగా బలహీనపడినప్పటికీ.. దిత్వా ప్రభావం అనేక జిల్లాలపై తీవ్రంగా పడింది. నవంబర్‌ 30 నుంచి వర్షాలు ప్రారంభమైనా.. తొలి మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వానలకే పరిమితమయ్యాయి. అయితే మంగళవారం (డిసెంబర్‌ 2) నుంచి పరిస్థితి ఒక్కసారిగా మారి, పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇందులో ముఖ్యంగా నెల్లూరు జిల్లా దిత్వా ప్రభావంతో తీవ్రంగా నష్టపోయింది.

వివరాలు 

నీట మునిగిన వరి పంట 

గత 24 గంటల వ్యవధిలో వెంకటాచలం ప్రాంతంలో అత్యధికంగా 219.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, మనుబోలులో 158.8 మిల్లీమీటర్లు, ముత్తుకూరులో 140.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. అలాగే కోట, వాకాడు, చిల్లకూరు ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు నమోదయ్యాయి. ఈ ఎడతెరిపి లేని వానలకు పెన్నా, కండలేరు, కైవల్య, కాళంగి, సరేనాముఖి, బొగ్గేరు, బీరాపేరు, కొమ్మలేరు, నక్కలవాగు, పందులవాగు వంటి వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. నెల్లూరు జిల్లా పరిధిలోని పలు శివారు గ్రామాలు పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వందల ఎకరాల్లో వరి పంట నీట మునగడంతో పాటు, కూరగాయలు, పండ్ల తోటలు కూడా తీవ్రంగా నష్టపోయాయి.

Advertisement