
Cyclone Michaung: బాపట్ల సమీపంలో తీరాన్ని తాకిన 'మిచౌంగ్' తుపాను
ఈ వార్తాకథనం ఏంటి
బంగాళాఖాతంలో ఏర్పడిన 'మిచౌంగ్' తుపాను తీరాన్ని తాకింది. బాపట్ల సమీపంలో తీరాన్ని తాకినట్లు వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు.
మరికొద్ది సేపట్లో తుపాను తీరం దాటుతుందని పేర్కొన్నారు. ఈ క్రమంలో తుపాను సాయంత్రం సమయానికి తుపాను బలహీనపడుతుదని అధికారులు వెల్లడించారు.
ఆ తర్వాత తుపాను వాయుగుండంగా మారుతుందని స్పష్టం చేశారు.
ఇదిలా ఉంటే, తుపాను తీరం దాటుతున్న సమయంలో బాపట్ల సమీపంలో ఈదురుగాలు వీస్తాయని, భారీ వర్షాలు కురుస్తున్నాయి.
అలాగే సముద్రంలో రాకాసి అలలు ఎగిసిపడుతున్నాయి. తుపాను వల్ల ఏపీతోపాటు, తెలంగాణలో కూడా వర్షాలు కురుస్తున్నాయి.
అలాగే తీర ప్రాంత జిల్లాలైన నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్, కృష్ణాలో భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ ప్రాంతాల్లో వర్షాల వల్ల పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఏపీలో వర్ష బీభత్సం
ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికందకుండా పోతే రైతుకు తీరని నష్టం. కోతల సమయంలో విరుచుకుపడ్డ తుపాను రైతును కోలుకోలేని దెబ్బ తీసింది. ఈ సమయంలో రైతులకు సీఎం జగన్ అండగా నిలబడి నిబందనలతో సంబందం లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయడం, ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించడం సీఎం చేసిన… pic.twitter.com/p7iz8wee8v
— Thopudurthi Prakash Reddy (@prakashreddysT) December 5, 2023