LOADING...
Montha Cyclone Effect: ప్రళయవేగంతో దూసుకొస్తున్న 'మొంథా'.. కాకినాడ- మచిలీపట్నం మధ్య తీరాన్ని తాకిన తుపాను
ప్రళయవేగంతో దూసుకొస్తున్న 'మొంథా'.. కాకినాడ- మచిలీపట్నం మధ్య తీరాన్ని తాకిన తుపాను

Montha Cyclone Effect: ప్రళయవేగంతో దూసుకొస్తున్న 'మొంథా'.. కాకినాడ- మచిలీపట్నం మధ్య తీరాన్ని తాకిన తుపాను

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 28, 2025
08:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

గడిచిన ఆరు గంటల్లో మొంథా తుపాను గంటకు సగటున 17 కిలోమీటర్ల వేగంతో ముందుకు కదిలింది. ప్రస్తుతం ఈ తుఫాన్ మచిలీపట్నానికి దక్షిణ-ఆగ్నేయ దిశలో సుమారు 120 కిలోమీటర్ల దూరంలో, కాకినాడకు 110 కిలోమీటర్ల దూరంలో, విశాఖపట్నానికి 220 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. తీరానికి మరింత దగ్గరగా చేరుతున్న కొద్దీ, తుపాన్ తీవ్రత పెరిగే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. గడచిన కొన్ని గంటలుగా సముద్రతీర ప్రాంతాల్లో గాలివానలు మొదలయ్యాయి. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు సముద్ర యాత్రలకు దూరంగా ఉండాలని అధికారులు సూచించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ముంచుకొస్తున్న తుపాను