తదుపరి వార్తా కథనం
Cyclone Montha : ఉప్పాడ తీరంలో ఎగసిపడుతున్న అలలు.. సముద్ర తీరం వద్ద వందల ఇళ్లు ధ్వంసం
వ్రాసిన వారు
Sirish Praharaju
Oct 28, 2025
05:36 pm
ఈ వార్తాకథనం ఏంటి
మొంథా తుపాన్ (Cyclone Montha) ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతాలు తీవ్ర అలజడిని ఎదుర్కొంటున్నాయి. కాకినాడ జిల్లా ఉప్పాడ తీరంలో సముద్రం ఉధృతంగా ఎగసిపడుతోంది. కెరటాల వేగం మరింత పెరగడంతో ఉప్పాడ-కాకినాడ బీచ్ రోడ్ తీవ్రంగా దెబ్బతింది. దీంతో ఆ మార్గంలో వాహన రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఇ దే సమయంలో ఉప్పాడ తీర ప్రాంతం వరుసగా కోతకు గురవుతోంది. ఇప్పటికే అక్కడి కొన్ని ఇళ్లు తీవ్రంగా దెబ్బతిని ఎప్పుడైనా కూలిపోయే పరిస్థితిలో ఉన్నాయి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఉప్పాడ తీరంలో ఎగిసిపడుతున్న అలలు
ఉప్పాడ తీరంలో ఎగిసిపడుతున్న అలలు.
— greatandhra (@greatandhranews) October 28, 2025
కానపాపపేట గ్రామంలో సముద్రతీర హానితో వందల ఇళ్లు ధ్వంసం అయ్యాయి
మత్స్యకారులు ఉపాధి, ఇళ్లను తప్పకెళ్ళడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. pic.twitter.com/s4KK0vTOyz