Cyclone Murasu: ఏపీ తీరంవైపు దూసుకొస్తున్న 'మురసు' తుపాను.. నెల్లూరు-నరసాపురం మధ్య తీరం దాటే ఛాన్స్!
ఈ వార్తాకథనం ఏంటి
బంగాళాఖాతంలో ఏర్పడిన మురసు తుపాను (Cyclone Murasu) వేగంగా కదులుతోంది. గత ఆరు గంటల్లో గంటకు 23 కిలోమీటర్ల వేగంతో పయనించింది. ప్రస్తుతం ఈ తుపాను పలు తీర ప్రాంతాలకు సమీపంలో కేంద్రీకృతమై ఉంది. చెన్నైకి 560 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 660 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 640 కిలోమీటర్లు, నెల్లూరుకు 630 కిలోమీటర్లు, ఒంగోలుకు 680 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు సమాచారం. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం.. మురసు తుపాను రేపు ఉదయానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా బలపడే అవకాశం ఉంది. అనంతరం ఏపీ తీరంవైపు కదులుతూ ప్రభావం చూపనుంది.
వివరాలు
నెల్లూరు - నరసాపురం మధ్య తీరం దాటే అవకాశం
మురసు తుపాను సోమవారం అర్ధరాత్రి లేదా ఎల్లుండి తెల్లవారుజాము సమయంలో నెల్లూరు - నరసాపురం మధ్య తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
తుపాను కదలికలు, తీవ్రతను వాతావరణ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
తుపాను నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. తీర ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
వివరాలు
దక్షిణ కోస్తా, రాయలసీమకు భారీ వర్ష సూచన
మురసు తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ముఖ్యంగా దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది.
ఈ నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు.
తుపాను ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని అప్రమత్తంగా ఉండాలని, అధికారులు జారీ చేసే సూచనలు పాటించాలని తెలిపారు.